ఛాన్సులు ఇస్తానని బెడ్ రూమ్ కు రమ్మన్నారుః స‌ల్మాన్ మాజీ ప్రియురాలు

Update: 2021-04-04 06:30 GMT
పాకిస్తాన్ మోడ‌ల్‌, స‌ల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సోమిఅలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. 1991లో బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఆమె.. ప‌లు చిత్రాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత స‌ల్మాన్ ప్రియురాలుగా ఫుల్ ఫేమ‌స్ అయ్యారు. అయితే.. కొంద‌రు మూవీ మేక‌ర్స్ సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తామ‌ని చెప్పి.. త‌న‌తో శృంగారం చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని ఆమె చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన బాలీవుడ్ ఇండ‌స్ట్రీతోపాటు స‌ల్మాన్ పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. కేవ‌లం ఏడు సంవ‌త్స‌రాల వ‌ర‌కే బాలీవుడ్ లో ఉన్న ఆమె.. ఈ కొద్ది కాలంలోనే తాను ఎన్నో చేదు అనుభ‌వాల‌ను చ‌విచూశాన‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం.

మొద‌ట్లో త‌న సినిమాలు బాగానే ఆడాయని, ఆ త‌ర్వాత ఫ్లాపులు ఎదుర‌య్యాయ‌ని సోమిఅలీ చెప్పింది. దీంతో.. త‌నుకు అవ‌కాశాలు త‌గ్గాయ‌ని తెలిపింది. అయితే.. ఇదే అదునుగా అవ‌కాశాలు ఇప్పిస్తామ‌ని చెప్పి, కొంత మంది ద‌ర్శ‌కులు త‌న‌తో శృంగారం చేయాల‌ని చూశార‌ని సోమి వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

ఇలాంటి చేదు అనుభ‌వాలు ఎన్నో ఎదుర‌య్యాయ‌ని చెప్పిన సోమి.. అప్ప‌టికే అంత‌క‌న్నా దారుణ‌మైన రిలేష‌న్ షిప్ లో ఉన్నాన‌ని చెప్పింద‌ట‌. స‌ల్మాన్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు భావిస్తున్నారు. అయితే.. స‌ల్మాన్ మొద‌టి గ‌ర్ల్ ఫ్రెండ్ గా అంద‌రికీ సుప‌రిచితురాలు అయ్యారు సోమి అలీ.  ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News