`స‌లార్` రెండు భాగాలు.. లాజిక్ క‌రెక్టేనా!`

Update: 2022-01-30 14:30 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ తొలి పాన్ ఇండియా చిత్రం `బాహుబ‌లి` రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.2600 కోట్లు కొల్ల‌గొట్టింది ఈ ఫ్రాంఛైజీ. ఇంత‌టి స‌క్సెస్ డార్లింగ్ ప్ర‌భాస్ కి పాన్ వ‌ర‌ల్డ్ క్రేజ్ ని తీసుకొచ్చింది. నిజానికి `బాహుబ‌లి`  ప్రారంభ‌మైన కొత్త‌లో ఒకే సినిమా అనుకున్నారు. ఆ ర‌కంగానే మీడియాలో సైతం ప్ర‌చారం సాగింది.  కానీ సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత రెండు సినిమాలు గా తీయాల‌ని జ‌క్క‌న్న టీమ్ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. మ‌రి ఇప్పుడు ఇదే త‌ర‌హాలో `స‌లార్` విష‌యంలోనూ జ‌రుగుతోందా? అంటే అవున‌నే  ప్ర‌చారం సోష‌ల్ మీడియాల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. దీనికి ఇంట్రెస్టింగ్ లాజిక్ ని కూడా వెతికారు అభిమానులు.

`స‌లార్` ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ `కేజీఎఫ్` ని రెండు భాగాలుగా తీసాడు. ఇప్ప‌టికే మొద‌టి భాగం `కేజీఎఫ్ చాప్ట‌ర్ -1` గా రిలీజ్ అయి పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు రెండ‌వ భాగం ఇదే ఏడాది రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని...`స‌లార్` యాక్ష‌న్  కంటెంట్ ని ఆధారంగా చేసుకుని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మొద‌టి భాగం ఈ ఏడాది అక్టోబ‌ర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ని.. రెండ‌వ భాగం 2023 స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేస్తార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. దీనికి త‌గ్గ‌ట్టు ఈ ప్ర‌చారాన్ని ఓ సందేహం సైతం బ‌ల‌ప‌రుస్తోంది.

`స‌లార్` లో  హీరోయిన్ గా న‌టిస్తోన్న శ్రుతిహాస‌న్ కి మేక‌ర్స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. కానీ  ఈ ప్ర‌చారంపై ఎక్క‌డా నోరు విప్ప‌లేదు. మ‌రి  అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారంటే? ఎంతో కొంత వాస్త‌వం లేక‌పోలేద‌ని సోష‌ల్ మీడియా ఎన‌లిస్టులు సైతం  అభిప్రాయ‌ప‌డ‌టం కొస‌మెరుపు. మ‌రి ఆ సంగ‌తేంటో తేలాలంటే నిర్మాత‌లు సీన్ లోకి రావాల్సిందే. ఇప్ప‌టికే `స‌లార్` షూటింగ్ 60 శాతం పూర్త‌యింది. బ్యాలెన్స్ షూటింగ్ త్వ‌ర‌లో మొద‌లు కానుంది. ఇటీవ‌లే ప్ర‌భాస్ విదేశాలకు విహార‌యాత్ర‌కు వెళ్లి హైద‌రాబాద్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News