కింగ్ కి రైట్ హ్యాండ్ ప్రభాస్ అయితే.. మరి కింగ్ ఎవరు..?
వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ ని అనౌన్స్ చేశాడు. 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించనున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. 'సలార్' అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ వైలెంట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక సలార్ అంటే ఏంటనే విషయంపై అందరిలో ఆసక్తి మొదలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ నీల్ 'సలార్' కి అర్థమేమిటో వెల్లడించారు.
'సలార్’ అంటే కింగ్ కి రైట్ హ్యాండుగా ఉంటూ ప్రజలను రక్షించే వ్యక్తి అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ప్రశాంత్ చెప్పిన 'కింగ్' పాత్ర గురించి అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. కింగ్ పాత్ర ఎలా ఉండబోతోందని.. ఆ పాత్రలో ఎవరు నటిస్తారో అని.. లేదా మాఫియా డాన్ కి ప్రభాస్ విధేయుడిగా రక్షకుడిగా ఉంటాడేమో అని.. రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ పాత్ర ఉంటుందో ఉండదో అనేది పక్కన పెడితే ప్రభాస్ మాత్రం ఇందులో మోస్ట్ వైలెంటెడ్ మ్యాన్ గా కనిపిస్తాడని ఫస్ట్ లుక్ తోనే ప్రశాంత్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం 'కేజీఎఫ్ 2' సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్.. 2021 జనవరిలో 'సలార్' చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.