• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏ నోట చూసినా సాయిపల్లవి...

ఏ నోట చూసినా సాయిపల్లవి మాటే!

By - Tupaki Desk
Update: 2021-06-21 12:30 GMT
తెలుగు తెరపైకి చాలామంది హీరోయిన్లు వచ్చారు .. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు. కొంతమంది కథానాయికలు గ్లామర్ పరంగా నిలదొక్కుకుంటే, మరికొంతమంది నటన ప్రధానమైన పాత్రలతో రాణించారు. అయితే నటన ప్రధానమని సాగిన చాలామంది కథానాయికలు, తమ స్వభావానికి తగని పాత్రలను పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ రోజుల్లో స్కిన్ షో  చేయకుండా రాణించడం కూడా కష్టమైన విషయమే.

చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతూ తాను ఎలాంటి పాత్రలకు సెట్ అవుతాను? ఎలాంటి పాత్రలలో మెప్పించగలను? అనే ఆలోచన చేయడం .. అలా ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ దిశగానే అడుగులు వేయడం కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. నేను ఫలానా కథలను మాత్రమే చేస్తాను .. నా పాత్ర పరిథి ఇలా ఉండాలి అనే ఒక విషయాన్ని కెరియర్ ఆరంభంలో చెప్పే సాహసం ఎవరూ చేయరు. కానీ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్న కథానాయికగా సాయిపల్లవి కనిపిస్తుంది.

సాయిపల్లవిని తొలిసారిగా తెరపై చూసినవారు గ్లామర్ పరంగా ఒక మోస్తరుగా ఉందని అనుకున్నారు. కానీ ఆమె నటన చూశాక అభిమానులుగా మారకుండా ఉండటం కష్టమని భావించారు. సాధారణంగా కథలో ఒక పాత్రగా హీరోయిన్లు  అలరిస్తూ ఉంటారు. కానీ తన చేయిని అందించి ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే హీరోయిన్ గా సాయిపల్లవి కనిపిస్తుంది. చురుకుగా .. చలాకీగా ఉంటూ యూత్ ను .. పద్ధతిగా కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం సాయిపల్లవి ప్రత్యేకతగా చెప్పొచ్చు. అందువల్లనే అందరూ ఇప్పుడు ఈ అమ్మాయిని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక వరుసగా రానున్న ఆమె సినిమాలు చూడటానికి సిద్ధమైపోతున్నారు. 
Tags:    
  • sai pallavi 
  • virata parvam 
  • rana 
  • love story 
  • shyam singha roy 

Similar News

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

Copyright @2026

Powered by Blink CMS