• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలాంటి రోల్ కోసం వెయిట్...

అలాంటి రోల్ కోసం వెయిట్ చేనున్నాను

By - Tupaki Desk
Update: 2021-11-12 17:30 GMT
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ ఉంది. సాయిపల్లవి నటనలోని సహజత్వాన్నీ .. ఆమె నటనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ముఖ్యంగా ఆమె చాలా మంచి డాన్సర్. ఆమెతో డాన్స్ అంటే హీరోలు కాస్త ఎక్కువగా రిహార్సల్స్ చేస్తారు.

ఏ భాషలోను స్కిన్ షో చేయకుండా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుండటం ఆమెకి మాత్రమే చెల్లింది. సాధారణంగా హీరోయిన్స్ లో కొంతమంది యూత్ కి నచ్చితే, మరికొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతారు. ఈ రెండు వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడం సాయిపల్లవి ప్రత్యేకత.

సాయిపల్లవి నుంచి ఇటీవల వచ్చిన 'లవ్ స్టోరీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. డాన్స్ పరంగా ఆమెకి మరిన్ని మార్కులు తెచ్చిపెట్టింది. ఇక త్వరలో ఆమె నుంచి 'విరాటపర్వం' .. 'శ్యామ్ సింగ రాయ్' రానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన జోనర్లకు చెందినవే.

నక్సలిజం నేపథ్యంలో 'విరాటపర్వం' నడిస్తే, చారిత్రక నేపథ్యంలో 'శ్యామ్ సింగ రాయ్' కొనసాగుతుంది. ఆమె అభిమానులంతా కూడా ఈ సినిమాల కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలు తనకి మరింత మంచి పేరును తీసుకొస్తాయని సాయిపల్లవి భావిస్తోంది.

ఇంతవరకూ సాయిపల్లవి చాలా బరువైన పాత్రలను పోషిస్తూ వచ్చింది. బలమైన ఎమోషన్స్ తో కూడిన పాత్రలను చేస్తూ వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలను ఎక్కువగా ఎంచుకోవడం వలన, ఆమె ఆ తరహా పాత్రలను ఎక్కువగా చేయవలసి వచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. హిలేరియస్ కామెడీతో కూడిన కథల్లో .. మంచి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలను చేయాలని ఉందని చెప్పింది. అలాంటి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాననీ, ఆ తరహా పాత్రలలో తనని తాను నిరూపించుకోవాలని ఉందని అంది.

మరి సాయిపల్లవి కోసం అలాంటి పాత్రలను ఎవరు రెడీ చేస్తారో .. ఎప్పటికి ఆమె నిరీక్షణ ఫలిస్తుందో చూడాలి.
నాని సరసన నాయికగా సాయిపల్లవి చేసిన 'శ్యామ్ సింగ రాయ్' డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కొన్ని కథలను ఓకే చేశాననీ, ఆ ప్రాజెక్టుల విషయంలో త్వరలో క్లారిటీ వస్తుందని సాయిపల్లవి చెప్పింది. కొత్త ఏడాదిలో సాయిపల్లవి ఏ హీరోలతో కలిసి సెట్స్ పైకి వెళుతుందో, ఎలాంటి విభిన్నమైన పాత్రలతో సందడి చేస్తుందో చూడాలి.


Tags:    
  • Saipallavai 
  • Actress 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS