త‌ల్లిదండ్రుల‌ విడాకులపై సాయి తేజ్ చెప్పిన సంగ‌తి!

Update: 2020-04-25 04:00 GMT
మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ .. ఇటీవ‌లే సాయి తేజ్ గా పేరు మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. `పిల్లా నువ్వు లేని జీవితం` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఆరంగేట్రం చేసిన తేజ్ ఆ త‌ర్వాత సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్.. సుప్రీం లాంటి హిట్ చిత్రాల్లో న‌టించాడు. అయితే అనూహ్యంగా అత‌డి కెరీర్ స్లంపులో ప‌డింది. కొన్ని వ‌రుస ప్ర‌య‌త్నాలు చేసినా ఏదీ స‌క్సెస్ కాక‌పోవ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఆ క్ర‌మంలోనే పేరులో ధ‌ర‌మ్ ని తొల‌గించి సాయి తేజ్ గా మారాడు. నేమ్ ఛేంజ్ బాగానే క‌లిసొచ్చింది.

సంఖ్యా శాస్త్రం అత‌డి విష‌యంలో వ‌ర్క‌వుటైంది. వ‌రుస‌గా రెండు హిట్లు వ‌చ్చాయి. చిత్ర‌ల‌హ‌రి- ప్ర‌తి రోజూ పండ‌గే చిత్రాల‌తో ఊర‌ట చెందే విజ‌యాల్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదే హుషారులో అత‌డు `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా క్రైసిస్ కార‌ణంగా ప్ర‌స్తుతం షూటింగులు నిలిచిపోవ‌డంతో ఇంటికే అంకిత‌మ‌య్యాడు సాయి తేజ్.

ఆ క్ర‌మంలోనే త‌న కెరీర్ గురించి .. వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ప్ర‌స్థావిస్తూ త‌న‌ను క‌ల‌త‌కు గురి చేసిన ఓ ఘ‌ట‌న గురించి చెప్పాడు. తాను ప‌దో క్లాసులో ఉన్న‌ప్పుడు త‌ల్లి దండ్రులు విడిపోవ‌డం బాధ క‌లిగించింద‌ని తెలిపాడు. అమ్మా నాన్న మ‌ధ్య స‌రిప‌డ‌ లేదు. విడాకులు అనివార్య‌మైంది. అది చేదు జ్ఞాప‌కం. ఏదేమైనా గ‌తం గ‌తః. అమ్మ‌యినా నాన్న‌యినా అన్నీ అమ్మే. న‌న్ను త‌మ్ముడిని ఎంతో ప్రేమ ఆప్యాయ‌త‌ల‌తో ఏ లోటూ రాకుండా పెంచింది. త‌ను ఒక డాక్ట‌ర్ ని రెండో వివాహం చేసుకుంది. ఆయన చాలా మంచివారు`` అని తెలిపారు.
Tags:    

Similar News