• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయి పల్లవి డ్యూయల్ సిమ్...

సాయి పల్లవి డ్యూయల్ సిమ్ పోటీ

By - Tupaki Desk
Update: 2018-12-04 09:20 GMT
కొన్నిసార్లు మన సినిమాతో మన సినిమానే పోటీ పడాల్సి రావడం కొంత వింతగా ఉంటుంది. సాయి పల్లవికి అచ్చం అలాంటి పరిస్థితే ఎదురు కాబోతోంది. డిసెంబర్ 21న శర్వానంద్ తో నటించిన పడి పడి లేచే మనసు ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తనదే మరో సినిమా కూడా అదే డేట్ కి కర్చీఫ్ వేసుకుంది. ధనుష్ మారి 2 ఇదే తేదిని అఫీషియల్ గా లాక్ చేసుకుంది. ఒకేరోజు రెండు డిఫరెంట్ జానర్స్  సినిమాలతో పోటీ పడాల్సి రావడం సాయి పల్లవికి ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

పడి పడి లేచే మనసు లవ్ స్టొరీ కాగా మారి 2 ఊర మాస్ మాఫియా కథ. శర్వానంద్ సినిమాలో మెడికో కాగా మారి 2లో సాయి పల్లవి ఆటో డ్రైవర్. ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని పాత్రలు కావడం విశేషం. మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ ఇద్దరు హీరోలతో సాయి పల్లవి మొదటిసారి కలిసి నటిస్తోంది. మారి 2 తెలుగులో డబ్ అయ్యే అవకాశాలు తక్కువ. అదే రోజు ఇప్పటికే పడి పడి లేచే మనసుతో పాటు అంతరిక్షం-కేజిఎఫ్-జీరోలు షెడ్యూల్ చేసారు. ధియేటర్ల కొరత ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపధ్యంలో మారి 2 తెలుగులో వచ్చే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంత పోటీ మధ్య కష్టమే.

పైగా విఐపి 2 తర్వాత ధనుష్ సినిమాలు తెలుగులో డబ్ కావడం లేదు. ఇటీవలే విడుదలైన వడ చెన్నై మనదాకా రాలేదు. సో మారి 2 అనుమానంగానే ఉంది. మారి ఫస్ట్ పార్ట్ తెలుగులో మాస్ పేరుతో డబ్ అయ్యింది. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా చేసిన ఆ మూవీ ఇక్కడ అంతగా ఆడలేదు. మారి 2 మీద తమిళ్ లో మంచి అంచనాలే ఉన్నాయి ఏదైతేనేం సాయి పల్లవి తనతో తనే పోటీ పడాల్సిన పరిస్థితి డిసెంబర్ 21 వస్తోంది. అంటే ఒకే ఫోన్ లో రెండు సిమ్ములు ఉన్నట్టు ఒకే సాయి  పల్లవి రెండు బాషలలో పోటీ పడాలి.
Tags:    
  • Sai Pallavi 
  • Maari 2 
  • Padi Padi Leche Manasu 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS