• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లవ్ లెటర్ దొరకడంతో...

లవ్ లెటర్ దొరకడంతో అమ్మానాన్నలు నన్ను చితక్కొట్టారు: సాయి పల్లవి

By - Tupaki Desk
Update: 2022-07-11 12:30 GMT
రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన ''విరాటపర్వం'' సినిమా జూన్ 17న థియేటర్లలో విడుదలై వినర్శకుల ప్రశంసలు అందుకుంది. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబడి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా రానా - సాయి పల్లవి కలిసి బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ తో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయి పల్లవి మరియు రానా దగ్గుబాటి తమ నిజ జీవితంలో రాసిన లెటర్స్ గురించి  చర్చించుకున్నారు. స్కూల్‌ డేస్ లో ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాసినట్లు తెలిపిన సాయి పల్లవి.. దాని గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు చితక్కొట్టారని వెల్లడించింది.

'విరాటపర్వం' సినిమాలో నక్సలైట్ అయిన రవన్న (రానా) ను ప్రేమించిన వెన్నెల (సాయి పల్లవి).. అతన్ని ఆరాధిస్తూ కవితలు రాస్తుంది. అలానే అతని తల్లి రాసిన లేఖను అందించే ప్రయత్నంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే నిజజీవితంలో రాసిన ప్రేమ లేఖల గురించి గంగవ్వ ప్రశ్నించింది.

దీనికి సాయి పల్లవి స్పందిస్తూ.. 'రియల్ లైఫ్ లో ఒక్కసారి ఒక అబ్బాయికి రాశాను. అది చిన్నప్పుడు. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా. కానీ దొరికిపోయాను. అమ్మా నాన్నా అప్పుడు నన్ను బాగా కొట్టారు'' అని తెలిపింది.

అదే ప్రశ్నను రానా ని అడగ్గా.. చిన్నప్పుడు కారంచేడులో ఉన్న తన తాత దివంగత దగ్గుబాటి రామానాయుడుకి ఒక లెటర్ వ్రాసినట్లు బదులిచ్చారు. కానీ ఆ తరువాత లెటర్ రాసే అవసరం ఎప్పుడూ రాలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఇదిలా ఉంటే 'విరాటపర్వం' సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన సాయి పల్లవి.. ''గార్గి'' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఈ సినిమాని రూపొందించారు.

'గార్గి' చిత్రాన్ని జూలై 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి ఈ సినిమాని సమర్పిస్తుండటం విశేషం. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో సాయి పల్లవి ఒక టీచర్ గా అలరించనుంది.
Tags:    
  • TollywoodActress 
  • SaiPallavi 
  • PremamActress 
  • GargiMovie 
  • GautamRamaChandran 
  • RanaDaggubati 
  • VirataParvam 
  • MyVillageShow 

Similar News

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

Copyright @2026

Powered by Blink CMS