• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నాగరత్నమ్మ' డైలాగ్...

'నాగరత్నమ్మ' డైలాగ్ పార్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న స్టార్ రైటర్...!

By - Tupaki Desk
Update: 2020-07-18 14:00 GMT
భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే దర్శకులలో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. తెలుగు తమిళం కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు సింగీతం. 'మయూరి' 'పుష్పక విమానం' 'ఆదిత్య 369' 'మైఖేల్ మదన్ కామరాజు' 'భైరవద్వీపం' వంటి వైవిధ్యమైన సినిమాలకు ప్రేక్షకులకు అందించారు. చివరగా 'వెల్ కమ్ ఒబామా' అనే సినిమాని డైరెక్ట్ చేసిన సింగీతం శ్రీనివాస్ ప్రస్తుతం రెండు స్క్రిప్ట్స్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి నందమూరి బాలకృష్ణ 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్ గా రూపొందనుంది. మరొకటి ప్రముఖ కర్ణాటక గాయని నర్తకి, సాంస్క్రతిక ఉద్యమకారిణి అయిన బెంగళూరు నాగరత్తమ్మ జీవిత కథ అని తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాలకు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందించనున్నారు. ఇప్పటికే ఆ పనుల్లో ఉన్న సాయి మాధవ్ ముందుగా నాగరత్తమ్మ బయోపిక్ కోసం వర్క్ చేస్తున్నారట.

కాగా కర్ణాటక సంగీత ప్రాచుర్యానికి విశేష కృషిచేయడంతో పాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలకు ఆద్యురాలిగా నాగరత్తమ్మ గొప్ప కీర్తిని గడించారు. మహిళా హక్కుల కోసం పోరాడిన ఆమె జీవిత కథను నేటి తరాలకు తెలియజేసేందుకు భారీ స్థాయిలో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సాయి మాధవ్ ఈ స్టోరీకి మాటలు రాస్తున్నారు. ఇటీవల సాయి మాధవ్ మాట్లాడుతూ ఈ స్టోరీ డైలాగ్ పార్ట్ ఆగస్ట్ ఎండింగ్ కి అయిపోతుందని చెప్పారట. ఇక ఈ బయోపిక్ లో అక్కినేని సమంత లేదా అనుష్కని లీడ్ రోల్ లో నటింపజేయాలని ఆలోచిస్తున్నారట. ఈ స్క్రిప్ట్ పనులు పూర్తయిన వెంటనే బాలయ్య 'ఆదిత్య 369' సీక్వెల్ కోసం వర్క్ స్టార్ట్ చేయనున్నారట. ఇక సాయి మాధవ్ బుర్రా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకి కూడా డైలాగ్స్ అందిస్తున్నారు.
Tags:    
  • Nagaratnamma 
  • Sai Madhav Burra 
  • dialogue part 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS