• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూర్తిగా కోలుకున్న సాయి...

పూర్తిగా కోలుకున్న సాయి తేజ్.. డిశ్చార్జ్ ఎప్పుడంటే..?

By - Tupaki Desk
Update: 2021-09-21 06:54 GMT
టాలీవుడ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సాయి తేజ్ స్పృహలోనే ఉన్నారని.. లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని వైద్య బృందం సోమవారం వెల్లడించింది.

సాయి ధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకున్నార‌ని.. మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని వైద్యులు వెల్లడించారు. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న తేజ్.. అందరితో బాగానే మాట్లాడగలుగుతున్నారని తెలిపారు. అంతేకాదు రెండు మూడు రోజుల్లోనే సాయి తేజ్ ను డిశ్చార్జ్ కూడా చేసే అవకాశం ఉందని తెలియజేసారు. యువ హీరో పూర్తిగా కొలుకున్నాడనే న్యూస్ తెలియడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, హైదరాబాద్‌ లోని కేబుల్‌ బ్రిడ్జ్‌ - ఐకియా సమీపంలో సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి సాయి ధరమ్‌ తేజ్‌‌ స్పోర్ట్స్‌ బైక్‌ పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తేజ్ ను ముందుగా దగ్గరలోని మెడికవర్ హాస్పిటల్ కు తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. గత పది రోజులుగా జరిగిన చికిత్సతో సాయి తేజ్ కోలుకున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. సాయి తేజ్ హీరోగా దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ''రిప‌బ్లిక్‌'' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబ‌ర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రేపు సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు.
Tags:    
  • Sai Dharam Tej 
  • Sai Dharam Tej accident 
  • Sai Dharam Tej health condition 
  • Sai Dharam Tej bike accident 
  • Sai Dharam Tej Latest news 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS