• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అసలు కథ విన్నావా తేజు!

అసలు కథ విన్నావా తేజు!

By - Tupaki Desk
Update: 2018-06-26 07:08 GMT
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. చూడాలని ఉంది అనే సినిమాలో హీరోయిన్ అంజలా ఝవేరిని లైన్ లో పెట్టడం కోసం హీరో చిరంజీవి రైల్వే స్టేషన్ లో కనిపించి ఒకసారి కనిపించకుండా ఒకసారి మేజిక్ చేసి చివరికి తన పట్ల ఆకర్షితురాలు అయ్యేలా చేసుకుంటాడు. అలా ప్రేమ మొదలై పెళ్లి దాకా వెళ్తుంది. మనసంతా నువ్వే సినిమాలో సెకండ్ హీరోయిన్ తను రాయ్ తన బ్యాక్ గ్రౌండ్ చెప్పి బెదిరించి  హీరో ఉదయ్ కిరణ్ ని  24 గంటలు తన మాట వినేలా చేసుకుని అడ్డమైన పనులు చేయించుకుంటుంది. తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ పక్కన అతని ప్రేమకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాసులో వెంకటేష్ మ్యూజిక్ ట్రూప్ నడుపుతూ  హీరోయిన్ ని ప్రేమలో పడేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో రెజీనాకు డూప్లికేట్ బాయ్ ఫ్రెండ్ గా నటించేందుకు ఓకే చెప్తాడు సాయి ధరమ్ తేజ్.

ఇన్నేసి పాత ఉదాహరణలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనుకుంటున్నారా. ఐదు డిజాస్టర్ల తర్వాత సాయి ధరమ్ తేజ్ ఓకే చేసిన దర్శకుడు కరుణాకరన్ కథలో ఇవే ఉన్నాయి కాబట్టి. నిన్న వచ్చిన ట్రైలర్ లోనే పైన చెప్పినవన్నీ బయటపెడితే రేపు అసలు సినిమాలో ఇంకెన్ని ఉంటాయో అని మెగా ఫాన్స్ కు సైతం అనుమానం వస్తోంది. అంత రొటీన్ గా కరుణాకరన్ కథ రాసుకున్నట్టు కనిపిస్తోంది. ఏ మాత్రం కొత్తదనం లేకుండా గతంలో ఎన్నో సార్లు చూసేసిన టెంప్లెట్ లోనే తేజ్ ఐ లవ్ యుని తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే ఎంత రిస్క్ వద్దనుకున్నా మరీ ఇంత రొటీన్ రూట్ లో వెళ్తారా అనే అనుమానం రాకమానదు. పైగా ఇలాంటి కథలో మాస్ సినిమాలు  మాత్రమే చేస్తూ  వచ్చిన తేజుని  మరీ సాఫ్ట్ గా చూపిస్తే ఎంత వరకు మెచ్చుతారు అనేది కూడా అనుమానమే.

ఇవన్ని ఒక ఎత్తు అయితే లైఫ్ అండ్ డెత్ లాగా ఇది హిట్ అయ్యే తీరాలి అనే అవసరంతో ఈ సినిమాతో వస్తున్న సాయి ధరమ్ తేజ్ ఇందులో ఏమంత నచ్చి ఓకే చేసాడో విడుదల అయ్యాక కానీ చెప్పలేం. అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఒక మెతుకు చాలు అన్న రీతిలో ఇప్పుడు సినిమాల మీద అంచనాలు ట్రైలర్ ను బట్టే ఉంటున్నాయి. అలా చూసుకుంటే తేజ్ ఐ లవ్ యు వాటిని తగ్గించేలా ఉంది.ఎంత యూత్ ని టార్గెట్ చేసినా అన్ని ప్రేమ కథలు సక్సెస్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. లవ్ అని ఉన్నంత మాత్రాన ఏ సినిమాను యూత్ నెత్తిన పెట్టుకోలేదు. మెప్పించే కథా కథనాలు వినూత్నంగా  అనిపించే ప్రెజెంటేషన్ చాలా అవసరం. మరి ఈ సూత్రాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తున్న తేజ్ ఐ లవ్ యు థియేటర్ లో ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో జూన్ 6న చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    
  • Sai Dharam Tej 
  • Tej I Love You Movie 
  • Telugu NEws 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS