• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్లాప్ హీరో ఇంకోటి ఓకే...

ఫ్లాప్ హీరో ఇంకోటి ఓకే చేశాడు..

By - Tupaki Desk
Update: 2018-12-26 14:30 GMT
సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా పడ్డాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’.. లాంటి సూపర్ హిట్లతో హ్యాట్రిక్ కొట్టిన అతడు.. ఆ తర్వాత ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘తేజ్ ఐ లవ్యూ’ కూడా తేడా కొట్టేయడంతో తేజు కెరీర్ ప్రమాదంలో పడిపోయింది. అంతకుముందు వరకు విరామం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సినిమా చేస్తూ పోయిన తేజు.. ఈ సారి మాత్రం బ్రేక్ తీసుకున్నాడు. ఆచితూచి కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ మొదలుపెట్టుకున్నాడు. ఈ సినిమా తేజు కెరీర్ కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా అయ్యేంత వరకు ఇంకో సినిమా గురించి ఆలోచించకూడదనే అనుకున్నాడు తేజు. కానీ మధ్యలో అతడిని దర్శకుడు అశోక్ డిస్టర్బ్ చేసేశాడట.

‘పిల్ల జమీందార్’.. ‘భాగమతి’ లాంటి హిట్ సినిమాలు తీసిన అశోక్.. ఇటీవలే తేజు ను కలిసి ఒక కథ చెప్పినట్లు సమాచారం. ‘భాగమతి’ తరహాలోనే ఇదొక వెరైటీ థ్రిల్లర్ అని తెలిసింది. స్క్రిప్టు చాలా బాగుండటంతో తేజు ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడట. తేజు కెరీర్ మీద మెగా ఫ్యామిలీ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టింది. అతడితో అల్లు అరవింద్ స్వయంగా ఓ సినిమా చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. బహుశా తేజు-అశోక్ సినిమాను ఆయనే నిర్మించినా నిర్మించవచ్చేమో. ‘చిత్రలహరి’ పూర్తయ్యేలోపు అశోక్ పూర్తి స్క్రిప్టు రెడీ చేసి ఫైనల్ వెర్షన్ తేజు తో పాటు మెగా ఫ్యామిలీ పెద్దలకు వినిపిస్తాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘చిత్రలహరి’ సినిమాను నానితో చేయాలనుకున్నాడు కిషోర్. కానీ అనివార్య కారణాలతో నాని ఈ సినిమా చేయలేదు. తేజు లైన్లోకి వచ్చాడు. పెద్ద బేనర్లో అభిరుచి ఉన్న దర్శకుడితో చేస్తున్న సినిమా కావడంతో ఇది కచ్చితంగా తన కెరీర్ కు ఊపు తెస్తుందని తేజు ఆశిస్తున్నాడు.
 
Tags:    
  • Sai Dharam Tej 
  • . Tollywood 
  • telugu News 
  • Mega Hero 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS