ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం..
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని రెహమాన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు రెహమాన్ కు సానుభూతి తెలుపుతున్నారు.
కాగా.. రెహమాన్ అసలు పేరు దిలీప్. ఆయన ప్రముఖ సంగీత కళాకారుడు శేఖర్ కుమారుడు. దిలీప్ రెహమాన్ గా మారడంలో తల్లి కమల ముఖ్యపాత్ర పోషించింది. శేఖర్ కన్నుమూసిన తర్వాత దిలీప్ సంగీత రంగంలోకి అడుగు పెట్టడానికి, ఆయన సూఫీయిజాన్ని స్వీకరించడానికీ ఆమె ప్రోత్సాహమే కారణం.
భర్త అనారోగ్యంతో మరణించిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆమె సూఫీయిజం ద్వారా స్వాంతన పొందింది. ఆ విధంగా తన పేరును కరీమా బేగమ్ గా మార్చుకోవడంతో పాటు కుమారుడు దిలీప్ పేరును అల్లా రఖా రెహమాన్ గా మార్చింది. శేఖర్ కన్నుమూసిన పదేళ్ళ తర్వాత వీరి కుటుంబం మొత్తం ఇస్లాం మతాన్ని స్వీకరించింది. తల్లి కరీమా అంటే రెహమాన్ కు ఎంతో ప్రేమ. తాను సంగీత దర్శకుడు కాగలననే విశ్వాసాన్ని ఆమె నింపిందని రెహమాన్ చెబుతుంటారు. కరీమా బేగానికి నలుగురు సంతానం కాగా.. వీరిలో ఏఆర్ రెహమాన్ చిన్నవాడు.