బాలయ్య వస్తే నేను సిద్దం
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. గత అయిదు సంవత్సరాల్లో గోవిందుడు అందరి వాడేలే, నక్షత్రం చిత్రాలను మాత్రమే ఈయన తెరకెక్కించాడు. గత దశాబ్ద కాలంగా క్రియేటివ్ డైరెక్టర్ కు మంచి కమర్షియల్ సక్సెస్ పడలేదు. దాంతో కృష్ణవంశీ సినిమాల సంఖ్య తగ్గించాడు. గత కొంత కాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కృష్ణవంశీ తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమద్య బాలకృష్ణ తో 'రైతు' అనే చిత్రంను చేయాలని కృష్ణవంశీ భావించాడు. కాని అందులోని ఒక పాత్రకు అమితాబచ్చన్ ను సంప్రదించిన సమయంలో ఆయన ఒప్పుకోలేదు. దాంతో సినిమాను ఆపేశారనే టాక్ వినిపిస్తుంది.
తాజాగా ట్విట్టర్ వేదికగా కృష్ణవంశీ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఆ సమయంలోనే బాలకృష్ణ తో 'రైతు' మూవీ పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నించగా ఇప్పటికి కూడా ఆ సినిమాను చేసేందుకు నేను సిద్దంగా ఉన్నాను. అయితే బాలకృష్ణ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన నిర్ణయంతోనే రైతు సినిమా ఆధారపడి ఉంటుందని ఈ సందర్బంగా కృష్ణవంశీ అన్నాడు. అమితాబచ్చన్ ఓకే అంటేనే రైతుకు బాలయ్య ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ తో తాను తీసిన 'రాఖీ' సినిమా సంతృప్తిని ఇచ్చిందని, ఆ సినిమా ఫ్లాప్ కాదన్నాడు. ఇక సింధూరం వంటి సినిమాను సీక్వెల్ చేయడం అనే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు. అలాంటి సినిమాలను టచ్ చేసే ఆలోచన నాకు లేదని అన్నాడు. మీ తర్వాత సినిమా ఎప్పుడు అన్న ప్రశ్నకు కృష్ణవంశీ స్పందిస్తూ ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చాడు. కృష్ణవంశీ తదుపరి చిత్రం కోసం ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన నుండి ఎప్పుడు ప్రకటన వస్తుందో చూడాలి.