బాహబలిలో యంగ్ టైగర్.. వాస్తవమెంత?

Update: 2016-05-05 05:20 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రాజమౌళి.. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. ఎన్టీఆర్ తో తాను ఎప్పుడూ సినిమాకి సిద్ధమే అని జక్కన్న అంటూ ఉంటాడు కానీ.. సంచలనాలు సృష్టించే ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కుతుంది. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి ది కంక్లూజన్ లో ఎన్టీఆర్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

బాహుబలిలో ఎన్టీఆర్ కేమియో గురించి వినగానే యంగ్ టైగర్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. జక్కన్నతో తమ హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్న మాట వాస్తవమే అయినా.. ఇలా కేమియోగా కాదని గగ్గోలు పెట్టేశారు. అయితే.. ఇప్పుడీ రూమర్స్ అంతా ఫాల్స్ అని తేలిపోయింది. తమ సినిమాలో ఎన్టీఆర్ యాక్ట్ చేయడం లేదని బాహుబలి యూనిట్ వర్గాలు అంటున్నాయి.

అసలు బాహుబలిలో కొత్త కేరక్టర్స్ పై ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికైతే జనతా గ్యారేజ్ ని తప్ప ఎన్టీఆర్ వేరే ఏ ప్రాజెక్ట్ చేయడం లేదని తేల్చేశారు సన్నిహతులు. కొరటాల శివతో చేస్తున్న ఈ మూవీతో.. తన కెరీర్ హిట్ తో పాటు ఇండస్ట్రీ రికార్డుల పైనా కన్నేసిన జూనియర్.. ఆగస్ట్ 12న ఈ మూవీని రిలీజ్ చేసే వరకూ.. వేరే ప్రాజెక్టుల జోలికి వెళ్లడం లేదన్న మాట మాత్రం ఫైనల్.
Tags:    

Similar News