అనుష్క.. ఆ సంగతి ఖాయం చేసేనా!!

Update: 2016-09-28 22:30 GMT
టాలీవుడ్ స్వీటీ అనుష్క.. ఇప్పుడు కొంచెం సైజ్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది కానీ.. సినిమాల విషయంలో మాత్రం ఎలాంటి సమస్యలు లేవు. అనుష్క ఎలా కనిపించినా.. ఆమెకు వచ్చే ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. చేసే సినిమాలను చేస్తూనే ఉంది. ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ను ఫినిష్ చేస్తున్న స్వీటీ.. మరోవైపు కె. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న ఓం నమో వెంకటేశాయ లోను.. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ తీస్తున్న భాగమతిలోను కీలక పాత్రలు చేస్తోంది. ఇక కోలీవుడ్ సింగం ఇప్పటికే ఫినిష్ చేసేసింది.

అయితే.. ఈమధ్య అనుష్క పెళ్లి వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఫిలిం ఇండస్ట్రీకే చెందిన ఓ వ్యక్తిని ఈ భామ మ్యారేజ్ చేసుకోనుందని అంటున్నారు. హీరోయిన్స్ ఇలా తమ ఇండస్ట్రీకే చెందిన వారిని పెళ్లి చేసుకోవడం కొత్త కాకపోయినా.. ఆ వ్యక్తికి అనుష్కకు ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడంతోనే.. ఇది హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం అనుష్క ఏజ్ 34 ఏళ్లు కాగా.. ఈమె పెళ్లి చేసుకోనుందనే వార్తల్లో వ్యక్తి వయసు బాగా ఎక్కువ.

తన పెళ్లి వార్తలపై అనుష్క ఎలాంటి కామెంట్ చేయడం లేదు. కనీసం అలాంటిదేమీ లేదు అని కూడా చెప్పకపోవడంతో.. ఈ రూమర్ రాయుళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. స్వీటీ పెళ్లి చేసేసుకుంటోందనే వార్తలతో అభిమానులు మాత్రం తెగ వర్రీ అయిపోతున్నారు.
Tags:    

Similar News