• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగశౌర్య విషయంలో అది...

నాగశౌర్య విషయంలో అది పుకారు మాత్రమే!

By - Tupaki Desk
Update: 2022-04-02 09:45 GMT
టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న యంగ్ హీరోల జాబితాలో నాగశౌర్య ఒకరుగా కనిపిస్తాడు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే హ్యాండ్సమ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అమ్మాయిల్లో తనకి మంచి ఫాలోయింగ్ ఉండటం విశేషం. లవర్ బోయ్ ఇమేజ్ నుంచి బయటపడి, యాక్షన్ హీరోగానూ మంచి మార్కులు సంపాదించుకోవాలనే దిశగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది. తాజా ఇంటర్వ్యూలో అతని గురించి తల్లి ఉషా ప్రసాద్ మాట్లాడారు.

"మాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు .. నాగశౌర్యకి ఎవరి సపోర్ట్ లేదు. అందువలన తను సినిమాల్లోకి వెళతానని చెప్పినప్పుడు కూడా నేను వద్దనే  చెప్పాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో నెగ్గుకురావడం కష్టమనే అన్నాను. కానీ వాళ్ల నాన్న బాగానే సపోర్టు చేశారు. అప్పటి నుంచి నాగశౌర్య తనంతట తానుగా ఎదిగాడు .. ఇంతవరకూ జరిగిన ఆయన జర్నీ సంతోషంగానే ఉంది .. అయితే తను అనుకున్న స్థాయికి ఇంకా రీచ్ కాలేదనేదైతే మనసులో ఉంది. అనుకున్నది సాధిస్తాడనే గట్టి నమ్మకం ఉంది.

సినిమాల్లోకి రావడానికి నాగశౌర్య చాలా కష్టపడ్డాడు. అలా కష్టపడితేనే పైకి వస్తారని తెలుసును గనుక, ఆ విషయాన్ని గురించి నేను ఎప్పుడూ బాధపడలేదు. తను ఓ గోల్ అనుకుని ఆ దిశగా వెళుతూ ఉంటే, ఎంకరేజ్  చేస్తాను అంతే. నాగశౌర్య కెరియర్ ఆరంభంలో .. తను ఎన్టీఆర్ భార్య 'ప్రణతి'కి కజిన్ అవుతాడనే టాక్ వచ్చింది. వాళ్ల సపోర్ట్ తోనే సినిమాల్లోకి వచ్చాడని చెప్పుకున్నారు .. కానీ అలాంటిదేమీ లేదు. ప్రణతి వాళ్ల కజిన్ పూజిత్ .. నాగశౌర్య మంచి ఫ్రెండ్స్ .. అంతే. అంతకుమించిన బంధుత్వమైతే లేదు.

ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా దగ్గర కదా అని ఏ నిర్మాతలు కలవడం జరగలేదు .. ఎన్టీఆర్ సజేషన్స్ ఇస్తారనే మాటలోను నిజం లేదు .. అదంతా పుకారు మాత్రమే. మొదటి నుంచి కూడా నాగశౌర్య  .. ఎన్టీఆర్ కి వీరాభిమాని. తనకంటూ సొంత అభిప్రాయాలు .. నిర్ణయాలు ఉంటాయి. తనకి నచ్చినట్టుగానే  ఉండనీయమని మేము అనుకుంటాము. తనది చాలా డిఫరెంట్ మెంటాలిటీ. ఫోన్ కూడా ఎక్కువగా వాడడు. మొదటి నుంచి కూడా తనకి ఇది కావాలని అడగడు. అతని మనసు తెలుసుకును మేమే ఏర్పాటు చేస్తుంటాము. అతను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకావడమనేది మాకు సంతోషాన్ని కలిగించే విషయం" అని చెప్పుకొచ్చారు.  
Tags:    
  • Naga Shourya 
  • Naga Shourya Movies 
  • Naga Shourya Comments 
  • Naga Shourya Movie Selections 
  • Jr Ntr 
  • RRR 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS