రుద్రమదేవి మరో ప్రేమనగర్ గా మారుతుందా?

Update: 2015-10-08 13:30 GMT
 అక్కినేని నాగేశ్వరరావుగారు నటించిన ప్రేమనగర్ సినిమా ఆ తరం సినీ అభిమానులు మర్చిపోదామనుకున్నా చేతకాని విషయం. ప్రధాన తారల నటనకంటే ముందుగా ఈ సినిమాను నిర్మించిన రామానాయుడుగారి గురించి ఎక్కువ ప్రస్థావన జరిగేది. అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతూ కాలాన్ని నెగ్గుకొస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రేమనగర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకుంది అంటే అందరూ విమర్శించారు. ఈ సినిమా ఫలితం గనుక అటూ ఇటూ అయితే ఇంక తట్టా బుట్టా సర్దుకుని తన ఊరికి పోదామని రామానాయుడుగారు కూడా సిద్ధమయ్యారు. మొత్తం తమ యావదాస్తిని పెట్టి తీసిన ప్రేమనగర్ భారీ విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. నాయుడు గారిని తిరుగులేని నిర్మాతగా నిలిపింది.  

కట్ చేస్తే ప్రస్తుతం మరో దర్శకుడిది కూడా అదే పరిస్థితి. వరుసపెట్టి పరాజయాల బాట పట్టిన గుణశేఖర్ తన కష్టాన్నే కాక యావదాస్తిని పెట్టి నిర్మాతగా మారి రుద్రమదేవి సినిమా తెరకెక్కించాడు. ఒకవేళ ఈ సినిమా గనుక అటూ ఇటు అయితే సీక్వెల్ మాట అటుంచితే తదుపరి భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తుంది. మరి ఇంతటి రేంజ్ లో రిస్క్ చేసి కళపై తన పిచ్చిని ప్రదర్శిస్తున్న గుణశేఖర్ కి రుద్రమదేవి కూడా ప్రేమనగర్ రేంజ్ లో విజయం అందించాలని కోరుకుందాం..
Tags:    

Similar News