• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్.ఆర్.ఆర్ టీం నుంచి మరో...

ఆర్.ఆర్.ఆర్ టీం నుంచి మరో సర్ ప్రైస్!

By - Tupaki Desk
Update: 2020-04-02 11:50 GMT
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా - ఎవరి నోట విన్నా 'ఆర్.ఆర్.ఆర్' మాటే వినిపిస్తోంది. ఒక సినిమాని జనాల్లోకి ఎలా తీసుకుపోవాలో రాజమౌళికి తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు అని చెప్పవచ్చు. ఒక్కసారి బయటకి వచ్చి ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేసాడంటే అది రిలీజై సూపర్ హిట్ అయ్యే దాకా జనాల మధ్య తిరుగుతూనే ఉంటుంది. ఇటీవలే ఉగాది సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను - మోస్టర్ పోస్టర్‌ ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ తరవాత రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ ఒక్క వీడియో సినిమా అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ప్రత్యేక వీడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ వీడియో ఈరోజే విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల కారణంగా వీడియోను విడుదల చేయలేకపోతున్నామని - లాక్‌ డౌన్ పూర్తికాగానే వీడియోను తీసుకొస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. నేడు అజయ్ దేవగణ్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేసింది.

‘గొప్ప మనసు కలిగిన అజయ్ దేవగణ్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆర్.ఆర్.ఆర్ మూవీ టీమ్‌లో మీరు భాగం కావడం గొప్ప గౌరవం. ఫస్ట్‌ షెడ్యూల్‌ లో మీతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. మీరు కూడా అలాంటి అనుభూతినే పొందినట్టు ఆశిస్తున్నాం. అజయ్ దేవగణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌ లుక్ - వీడియో విడుదల చేయాలని భావించాం. కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల వల్ల మ్యూజిక్ - డీఐ పనులు పూర్తిచేయలేకపోయాం. లాక్‌ డౌన్ సమయం పూర్తికాగానే మిమ్మల్ని అప్‌ డేట్స్‌ తో ఎంగేజ్ చేస్తాం’’ అని మూవీ టీమ్ ట్విట్టర్‌ లో పేర్కొంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ - కొమరం భీమ్‌ గా ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ - తమిళం - కన్నడ - మలయాళ భాషల్లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అత్యంత భారీగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ - ఆలియా భట్ - బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Tags:    
  • RRR Team 
  • Ajay Devgn 
  • Rajamouli 
  • Telugu News 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS