RRR: ఆ పాట లో అదే స్పెషాలిటీ!

Update: 2019-11-14 11:36 GMT
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్.. రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'RRR'. వచ్చే ఏడాది జులై 30 వ తారీఖున విడుదల చేస్తామని ముందే ప్రకటించడం తో ఆ డేట్ అందుకునేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా లో పాటల గురించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఇది రెగ్యులర్ సినిమా కాక పోయినప్పటికీ ఇందు లో ఐదు పాటలయితే ఉంటాయట. ఈ సినిమా దేశ భక్తి కథాంశానికి తగ్గట్టు మంచి పాటలను ప్లాన్ చేస్తున్నారట సంగీత దర్శకుడు కీరవాణి.

అయితే ఈ సినిమా లో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ వారిద్దరూ ఒక పాట లో మాత్రమే కలిసి కనిపిస్తారు. ఇది ఒక జానపదం అని..  ఉత్తరాది లో ఈ హీరోలిద్దరూ కలిసిన సమయం లో ఈ పాట వస్తుందట.  ఇద్దరూ ఈ పాటకు తమదైన శైలి లో డ్యాన్సులు వేస్తారని అంటున్నారు. ఈ సినిమా లో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి కనిపించే సన్నివేశాలు తక్కువే ఉంటాయట. అందుకే ఇద్దరి పై ఎక్కువ పాటల ను చిత్రీకరించే అవకాశం లేదని సమాచారం.    

రాజమౌళి లాస్ట్ ఫిలిం 'బాహుబలి' కి సంగీతం చాలా ప్లస్ అయిన సంగతి తెలిసిందే.  పాటలన్నీ సందర్భానుసారమే వస్తాయి కానీ అన్నీ వేటికవే హిట్లు గా నిలిచాయి. దీంతో ఈ సినిమా కు కూడా కీరవాణి మ్యాజిక్ రిపీట్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి.  చరణ్..ఎన్టీఆర్ లాంటి డ్యాన్సర్ల కు ఒక మంచి ట్యూన్ ఉంటే ఇక ఆ పాట రేంజ్ ఎక్కడి కో వెళ్లి పోతుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News