#RRR షూటింగుకి సెల‌విచ్చేస్తాడ‌ట‌!

Update: 2019-12-19 07:43 GMT
`బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి `ఆర్.ఆర్.ఆర్‌` పేరుతో భారీ మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ప్ర‌స్తుతం వైజాగ్ స‌మీపంలోని అర‌కు ప‌రిస‌రాల్లో చిత్రీక‌ర‌ణ‌ జ‌రుగుతోంది. క్లైమాక్స్ కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల్ని రామ్‌చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ ల‌పై చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే 70 చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అయితే ఇంత బిజీలోనూ రాజ‌మౌళి తాజా ట్వీట్ ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా రేర్ గా స్పందించే రాజ‌మౌళి తాజా పోస్ట్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒక రోజంతా ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి సెల‌విచ్చేస్తాన‌ని ప్ర‌క‌టించి జ‌క్క‌న్న పెద్ద షాకిచ్చాడు. అయితే అంత అవ‌స‌రం ఏం వ‌చ్చింది? అంటే..

ఈ త్యాగం త‌న ఫ్యామిలీ హీరోల కోస‌మే. సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి చిన్న కుమారుడు సింహా `మ‌త్తు వ‌ద‌ల‌రా` చిత్రం ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే చిత్రంతో పెద్ద కుమారుడు కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ మూస చిత్రాల మ‌త్తు వ‌దిలించేలా వుందన్న ప్ర‌శంసా ద‌క్కింది. దీంతో రంగంలోకి దిగిన  రాజ‌మౌళి త‌న అన్న కీర‌వాణి కుమారుల‌ని ప్రోత్స‌హించే ప‌నిలో ప‌డ్డారు.

``సింహా- కాల‌భైర‌వా ఈ ఇద్ద‌రు మా కుర్రాళ్లే. ఒకే సినిమాతో ప‌రిచ‌యం అవుతున్నారు. ద‌ర్శ‌కుడు రితేష్ అద్భుతంగా చేశాడు. ఈ డిసెంబ‌ర్ 25న నేను షూటింగ్ మానేస్తున్నాను`` అని ట్వీట్ చేశారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో వ‌స్తున్న `మ‌త్తువ‌ద‌ల‌రా` చిత్రం ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాని థియేట‌ర్ లో వీక్షించేందుకు ప్ర‌మోష‌న్ కోస‌మే జ‌క్క‌న్న ఇంత‌టి సాహ‌సం చేస్తున్నార‌న్న‌మాట‌. అయితే ప‌ని రాక్ష‌సుడు సెల‌వు ఇవ్వ‌క ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి ఊపిరాడ‌డం లేద‌ట. క‌నీసం మ‌త్తు వ‌ద‌ల‌రా పేరుతో ఒక‌రోజు సెల‌వు దొరుకుతున్నందుకు టీమ్ ఖుషీగా ఉంద‌న్న ముచ్చ‌టా వేడెక్కిస్తోంది
Tags:    

Similar News