షాకింగ్: ముంబైపై 3000 మంది ఎటాక్?

Update: 2021-12-12 08:30 GMT
అవును.. ముంబైపై మ‌రో ఎటాక్ గురించి గుస‌గుస వినిపిస్తోంది. ఈసారి ఐదారుగురు లేదా ప‌ది ఇర‌వై మంది కాదు ఏకంగా 3000 మంది ముంబైపై విరుచుకుప‌డ‌బోతున్నారు. ఎటాక్ కి రెడీ అవుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రీ ముష్క‌రులు అంటూ కాంగారు ప‌డ్డారా? అబ్బే అలాంటిదేం లేదు. ఈ ఎటాక్ వేరే..!

క్రేజీ పాన్ ఇండియా మూవీ RRR ప్ర‌మోష‌న్స్ కోసం ఈ హంగామా అంతా. రెండు రైళ్లలో ఏకంగా ముంబైకి 3000 మంది తెలుగు అభిమానులు ప్ర‌యాణ‌మ‌వుతుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇలాంటిది మునుపెన్న‌డూ క‌నీవినీ ఎరుగ‌నిది. టాలీవుడ్ రేంజు ఎంతో ముంబై ప‌రిశ్ర‌మ‌కు తెలిసొచ్చేలా మ‌రో అరుదైన సీన్ ఇద‌ని చెప్పుకోవ‌చ్చు.

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన RRR హిందీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరు కావడానికి ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు చెందిన‌ 3000 మంది అభిమానులు ముంబైకి వెళుతున్నారు. ముంబై ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతుండా.. వేదిక‌పై చ‌ర‌ణ్ - తార‌క్ ల‌తో స‌ల్మాన్ మెరుపులు మెరిపించ‌బోతున్నారు. ఈ ఈవెంట్ కోసం రెండు ప్రత్యేక రైళ్లు బుక్ చేసారు. ఒకటి కర్నూలు నుంచి.. మరొకటి విజయవాడ నుంచి ఒక్కో రైలులో 1500 మంది ఉంటారు. రైళ్లు కేవలం మూడు ప్రధాన స్టాప్ లలో మాత్ర‌మే ఆగుతాయి. ఈ రైళ్ల‌కు ఆఖరి గమ్యస్థానం ముంబై. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 3000 మంది అభిమానులలో 1500 మంది ఎన్టీఆర్ అభిమానులు.. మిగిలిన 1500 మంది రామ్ చరణ్ అభిమానులు ఉన్నారు. కేవ‌లం అభిమానులు మాత్ర‌మే ఈ రైళ్లు ఎక్కుతారు. ఈ అభిమానులు ముంబైలో RRR హిందీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తారు. వారికి అన్ని సౌక‌ర్యాల్ని టీమ్ ఏర్పాటు చేస్తుంది.

హిందీ మార్కెట్ పై ఇది ఒక దండ‌యాత్ర అనే చెప్పాలి. RRR హిందీ వెర్ష‌న్ పై ఇది అమాంతం హైప్ పెంచే ప్ర‌క్రియ అని చెప్పాలి. ఒక‌ర‌కంగా ఇది రాజమౌళి టీమ్ అనుస‌రిస్తున్న‌ మార్కెటింగ్ వ్యూహం. అన్ని ప్రధాన నగరాల్లో RRR ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లతో హీటెక్కించ‌గా ప్ర‌చార చిత్రం మిలియ‌న్ల వ్యూస్ తో సంచ‌ల‌నం సృష్టించింది.

తాజా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందడి ప‌రాకాష్ఠ‌కు చేరుతుండ‌గా స్టార్లు అన్ని న‌గ‌రాల్ని చుట్టేస్తున్నారు. తెలుగు ఈవెంట్ కూడా భారీగా జరగబోతోంది.ముంబైలో  వేడుకకు ఎన్టీఆర్- రామ్ చరణ్- ఆలియా భట్- అజయ్ దేవగన్ - కరణ్ జోహార్ వంటి ప్రముఖ నటీనటులు- సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.
Tags:    

Similar News