#RRR.. త‌స్మాత్ జాగ్ర‌త్త! ప‌ళ్లు నూరితే రిట‌ర్న్ గిఫ్ట్!!

Update: 2020-09-05 04:45 GMT
ఎన్టీఆర్ అభిమానుల‌కు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి అగ్ని ప‌రీక్ష పెడుతున్నారా? అస‌లు ఆయ‌న మైండ్ లో ఏం ఉంది? ఎందుక‌ని తార‌క్ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేయ‌డం లేదు. ఆర్.ఆర్.ఆర్ నుంచి తార‌క్ లుక్ ఎలా ఉండ‌నుంది?.. స‌స్పెన్స్ కి ఎందుక‌ని తెర దించేయ‌డం లేదు? ఇలా ప‌రిప‌రివిధాలా ఆలోచిస్తూ కంటికి కునుకు ప‌ట్ట‌కుండా జీవించేస్తున్నారు తార‌క్ ఫ్యాన్స్.

ఎందుకంటే చ‌ర‌ణ్ బ‌ర్త్ డేకి భ‌గ‌భ‌గ మండే అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్ ని ఓ రేంజులో రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రీటిచ్చిన జ‌క్క‌న్న తార‌క్ బ‌ర్త్ డే కి మాత్రం నిరాశ‌ప‌రిచాడు. ఎన్టీఆర్ అభిమానులంటే అంత లోకువా! అంటూ సోష‌ల్ మీడియాల్లో పెద్ద డిబేట్ ర‌న్ అయ్యింది. స‌మ‌యాభావం వ‌ల్ల ఇవ్వలేక‌పోతున్నామ‌నో.. కంటెంట్ స‌రిపోలేదనో తార‌క్ లుక్ ని తేలేమ‌ని చెబితే స‌రిపోతుందా?

అందుకే తార‌క్ ఫ్యాన్స్ జ‌క్కన్న దొరికితే నమిలేసేందుకు ప‌ళ్లు నూరుతున్నారు. సోష‌ల్ మీడియాల్లో అది ప్రాక్టిక‌ల్ గా బ‌య‌ట‌ప‌డిపోతోంది. అర్జెంటుగా తార‌క్ అధికారిక‌ లుక్ లాంచ్ చేయ‌క‌పోతే ప‌రిస్థితి ఇలానే కంటిన్యూ అవుతుంది మ‌రి. క‌నీసం లాక్ డౌన్ లో స‌మ‌యం దొరికినందుకు అయినా తార‌క్ లుక్ ని రిలీజ్ చేయొచ్చు క‌దా! అనేది ఫ్యాన్స్ ఆవేద‌న‌. కానీ మ‌హ‌మ్మారీ వ‌ల్ల అనుకున్న కొన్ని యాక్ష‌న్ సీక్వెన్సులు .. ప‌ర్ఫెక్ట్ టీజ‌ర్ కి అవ‌స‌ర‌మ‌య్యే కొన్ని విజువ‌ల్స్ కి సంబంధించిన వ‌ర్క్స్ పెండింగులో ప‌డిపోవ‌డంతో జ‌క్క‌న్న‌కు ఏం చేయాలో పాలుపోలేద‌ట‌. అవి వ‌స్తే కానీ కొమ‌రం భీమ్ పాత్ర‌ధారి (తార‌క్) లుక్ ని అల్లూరి రేంజులో రివీల్ చేయ‌డం కుద‌ర‌ద‌న్న‌ది ఆయ‌న భావ‌న‌.

అయితే ప‌ళ్లు బిగించిన వారంద‌రికీ త్వ‌ర‌లోనే రిట‌ర్న్ గిఫ్ట్ ఉంటుంది. కొంత షూటింగ్ చేశాక ఇస్తాడ‌ట‌. అయినా అభిమానులు ఇలా డీలా ప‌డిపోతే కుద‌ర‌దు. `రౌద్రం రణం రుధిరం` క్వాలిటీ ఔట్ పుట్ కావాలంటే.. కాస్త ఓపిక స‌హ‌నం చాలా చాలా అవ‌స‌రం.
Tags:    

Similar News