• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్...

'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ ఇప్పట్లో లేనట్లే...!

By - Tupaki Desk
Update: 2020-05-19 15:20 GMT
దర్శకధీరుడు రాజమౌళి రెండేళ్ల గ్యాప్ తీసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లతో 'రౌద్రం రణం రుధిరం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామ రాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా రెండుసార్లు విడుదల తేదీలను మార్చుకుంది. చివరగా 'ఆర్.ఆర్.ఆర్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే ఈ మధ్య చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా మళ్ళీ వాయిదా పడే అవకాశాలున్నాయి.

ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుత క్రైసిస్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. కాకపోతే మిగిలి భాగం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ చేయడానికి చాలానే సమయం పెట్టేలా ఉంది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడి ఎప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతాయో తెలియదు.. మిగతా షూటింగ్ పూర్తి చేయడానికి జక్కన్న ఎంత సమయం తీసుకుంటాడో తెలియదు. రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేసి.. ఒకవేళ అన్ని పనులు పూర్తి చేసినా ఈ సినిమా విడుదల అవ్వబోయేది వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా జూన్ జూలై లో అనే టాక్ వినబడుతోంది. ఎందుకంటే షూటింగ్స్ వాయిదా పడటంతో సినిమా విడుదల తేదీలు కూడా మారుతాయి. ఇప్పటికే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాను మొదటగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నారు.

దీనికి తోడు థియేటర్స్ ఇప్పుడల్లా ఓపెన్ అయ్యే అవకాశాలు లేవని అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ కి వేరే సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఎన్టీఆర్ - చరణ్ లను స్క్రీన్ మీద చూడబోయేది వచ్చే ఏడాది సమ్మర్ లో అనే విషయం తెలిసి ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. కాగా పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు.
Tags:    
  • RRR 
  • Rajamouli 
  • Ram Charan 
  • NTR 
  • Ajay Devagan 
  • Alia Bhatt 
  • Keeravani 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS