ఆర్ ఆర్ ఆర్ కు పోటీ సెగలు
ఇంకా విడుదలకు ఏడాది పైగా టైం ఉన్నప్పటికీ పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఆర్ఆర్ఆర్ కి ఇప్పటి నుంచే పోటీ సెగలు కొంచెం టెన్షన్ పెడుతున్నాయి. సౌత్ వరకు దీనికి పోటీగా ఎవరు తమ సినిమాలు రిలీజ్ చేసే సాహసం చేయరు కానీ బాలీవుడ్ లో మాత్రం నేనంటే నేను అనేలా ఇద్దరు స్టార్లు రేస్ లో నిలవడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సరిగ్గా జులై 31నే అక్షయ్ కుమార్ సూర్యవంశీ రాబోతున్నట్టు ఇంతకు ముందే ప్రకటించారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కాప్ యాక్షన్ స్టోరీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రతి ఈద్ కు తన సినిమా ఒకటి ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకునే సల్మాన్ ఖాన్ సైతం ఇన్షాఅల్లాతో పోటీకి సై అంటున్నాడు. దశాబ్దానికి పైగా గ్యాప్ తో సల్మాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడంతో హైప్ మాములుగా ఉండదు. దీనికి కూడా జులై 31నే డేట్ లాక్ చేయబోతున్నట్టు ముంబై మీడియా టాక్ వీటితో సమాంతరంగా ఆర్ఆర్ఆర్ ఒకే రోజు వస్తుంది.
సౌత్ వరకు చూసుకుంటే ఈ పోటీ వల్ల దెబ్బ తినేది సల్మాన్ అక్షయ్ లే. కానీ నార్త్ లో థియేటర్ల పరంగా డిస్ట్రిబ్యూషన్ పరంగా ఆర్ఆర్ఆర్ కు చిక్కులు తప్పవు. రాజమౌళి బ్రాండ్ చరణ్ తారక్ ల మాస్ ఇమేజ్ ఎంత పనిచేసినా అక్కడ సల్మాన్ అక్షయ్ లకున్న ఫాలోయింగ్ పరంగా మనం స్క్రీన్లు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. దీన్ని ఏమైనా రాజీ పద్ధతిలో పరిష్కరించుకునే దిశగా ప్లాన్ చేస్తారో లేక మూడుకి మూడు సై అని బాక్స్ ఆఫీస్ యుద్ధానికి దిగుతాయో వేచి చూడాలి. మూడు ప్రాజెక్ట్ ల వెనుక బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థలు ఉండటం వేడిని ఇంకాస్త రాజేస్తోంది