ఛాన్స్‌ ఉన్న చోట చేరిపోతున్నారు

Update: 2015-06-29 22:30 GMT
నీరు పల్లమెరుగు, ఆర్టిస్టులు ఛాన్సులెరుగు.. నీరు పల్లం వెతుక్కున్నట్టు, నటీనటులు పొరుగున అవకాశాలెతుక్కున్నట్టు.. టెక్నీషియన్లు కూడా అదే బాటలో వెళుతున్నారిప్పుడు. ఇటీవలి కాలంలో అవకాశాల స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా సరిహద్దులు చెరిపేసి, పొరుగు భాషల్లోకి దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా మ్యూజిక్‌ డైరెక్టర్లకు భాషతో సంబంధం లేకుండా అవకాశాలొస్తున్నాయి.

సీనియర్‌ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్‌, మణివర్మ వంటి వాళ్లు తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడలోనూ పాపులర్‌ అయ్యారు. కన్నడ పరిశ్రమలో అవకాశాలు వెతుక్కోవడం అనే ప్రత్యేకమైన ఆలోచన ఈ ఇద్దరికే ముందుగా వచ్చింది కూడా. ఆ తర్వాతి కాలంలో అనూప్‌ రూబెన్స్‌, సాయి కార్తీక్‌ డ్యూయల్‌ నేపథ్యం ఉన్న సినిమాలకు పనిచేశారు. కన్నడలో వచ్చిన అవకాశాల్ని వదులుకోలేదు. ఇప్పుడు అదే బాటలో ఆర్‌.పి.పట్నాయక్‌, రఘు కుంచె వంటి సంగీత దర్శకులు కన్నడ పరిశ్రమలో అవకాశాలు వెతుక్కుంటున్నారు. స్నేహాలు, పరిచయాలతో బోలోడన్ని అవకాశాలు వస్తున్నాయని సమాచారం. మంచిదే.. మడిగట్టుకుని కూచుంటేనే సమస్య. అవకాశం ఎక్కడ? అని వెతుక్కుని వెళితే తప్పేం కాదు. ఛాన్సు ఉన్న చోట చేరిపోవడమే!!

Tags:    

Similar News