• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డాషింగ్ డైరెక్టర్ కు రౌడీ...

డాషింగ్ డైరెక్టర్ కు రౌడీ స్టార్‌ స్పెషల్‌ విషెష్‌

By - Tupaki Desk
Update: 2021-09-28 12:39 GMT
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్‌ పూరి జగన్నాధ్.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండల కాంబోలో లైగర్ సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకు విజయ్‌ దేవరకొండను చూసినట్లుగా కాకుండా చాలా విభిన్నంగా విజయ్ దేవరకొండను పూరి జగన్నాద్‌ చూపించబోతున్నాడు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా లైగర్ గురించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. లైగర్ కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడుతున్నాడు. జుట్టు నుండి మొదలుకుని బాక్సింగ్‌ లో దెబ్బల వరకు ఎన్నో విషయాల్లో విజయ్ దేవరకొండ లైగర్ కోసం కష్టపడుతున్నాడు. లైగర్ లో తనను చాలా విభిన్నంగా పూరి జగన్నాద్‌ చూపిస్తాడని.. తనకు నటనకు పూర్తి స్కోప్ ఉన్న పాత్రను ఇచ్చాడు అంటూ గతంలో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి పూరి పై ప్రశంసలు కురిపించాడు రౌడీ స్టార్‌.

నేడు పూరి జగన్నాద్‌ బర్త్‌ డే సందర్బంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో స్పెషల్‌ విషెష్‌ చెప్పాడు. దాంతో పాటు పూరితో కలిసి ఉన్న ఒక రీసెంట్‌ ఫొటోను కూడా షేర్‌ చేశాడు. సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్‌ అవుతోంది. లైగర్ వర్కింగ్‌ స్టిల్‌. చేతికి గ్లౌజ్ లు వేసుకుని మొహంపై గాయంతో విజయ్‌ దేవరకొండ ఉన్నాడు. ఆ ఫొటోతో పాటు విజయ్ దేవరకొండ ట్విట్‌ లో.. నీవు నేను ఒక గమ్య స్థానంలో కలిశాము.. మనం కలిసిన రెండు సంవత్సరాలుగా నీవు నా దర్శకుడిగా నాకు ది బెస్ట్‌ ఛాన్స్ ఇచ్చావు. నా ప్రతిభను చాటుకునేందుకు కావాల్సినంత స్పేస్ ఇచ్చావు అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. సంతోషకర విషయాలు మరియు విచారకర విషయాలు అన్ని కూడా నేను నీతో షేర్‌ చేసుకునేలా మిత్రుడివి అయ్యావు. నేను ఇంటి నుండి బయటకు వచ్చి పనులు చేసుకుంటున్న సమయంలో నా గార్డియన్ గా నువ్వు ఉన్నావు అంటూ విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.

పూరి బర్త్‌ డే వేడుకలు గోవాలో లైగర్ చిత్ర యూనిట్‌ సమక్షంలో నిర్వహించారు. హీరో విజయ్‌ దేవరకొండతో పాటు సినిమా సహ నిర్వాత అయిన ఛార్మి ఇంకా పలువురు చిత్ర యూనిట్‌ సభ్యులు నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు పూరి బర్త్‌ డే కేక్‌ కటింగ్ లో పాల్గొన్నారు. గోవాలో భారీగా లైగర్ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. విదేశీ ఫైటర్లతో పాటు అత్యాధునిక టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. మైక్‌ టైసన్‌ ను ఈ సినిమాలో నటింపజేస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్‌ రేంజ్ లో లైగర్‌ పై ఆసక్తి కనిపిస్తుంది అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
Tags:    
  • Vijay Deverakonda 
  • Puri Jagannadh 
  • Liger 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS