• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆడవాళ్లు మీకు జోహార్లు'...

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్..!

By - Tupaki Desk
Update: 2021-07-22 06:16 GMT
యంగ్ హీరో శర్వానంద్ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ (ఎస్ ఎల్ వి సినిమాస్) బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.

దేవిశ్రీ ప్రసాద్ ఇంతకముందు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన 'నేను శైలజ' 'ఉన్నది ఒకటే జిందగీ' 'చిత్రలహరి' వంటి చిత్రాలను మ్యూజిక్ అందించారు. ఈ క్రమంగా వీరి కలయికలో నాలుగో మ్యూజికల్ చిత్రంగా ''ఆడవాళ్లు మీకు జోహార్లు'' రానుంది. అలానే ఇది శర్వా - రష్మిక - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం హీరోహీరోయిన్లతో సహా ముఖ్య తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా టైటిల్‌ ని బట్టి ఇందులో ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ కు మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్‌ ప్రసాద్‌ ఈ చిత్రానికి ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - గోపా రాజు - బెనార్జీ - కళ్యాణి నటరాజన్ - రాజశ్రీ నాయర్ - ఝాన్సీ - రజిత - సత్య కృష్ణ - ఆర్‌సిఎం రాజు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రంలో శర్వానంద్ - రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయని.. కిశోర్‌ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా ఈ సినిమాను తెర‌కెక్కిన్నారని.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది
Tags:    
  • Sharwanand 
  • Rashmika 
  • Aadavallu Meeku Joharlu 
  • Aadavallu Meeku Joharlu shooting 
  • Kishore Tiumala 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS