డిజిటల్ లో శృంగార కథాంశాలు శ్రుతి మించుతున్నాయా? అంటే అవుననే ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ లు ప్రూవ్ చేస్తున్నాయి. పెచ్చుమీరిన అతి వీటిలో కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ టీవీల్లో వెబ్ సిరీస్ లు వీక్షిస్తున్న యువతరాన్ని టీనేజర్లను టార్గెట్ చేస్తూ బూతు కంటెంట్ ని వండి వార్చేందుకు పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. వెబ్ కంటెంట్ కి సెన్సార్ షిప్ లేకపోవడం ఈ విచ్చలవిడితనానికి కారణం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా ఇదే కోవలో వచ్చిన వెబ్ సిరీస్ `రాస్ భరి`. స్వరా భాస్కర్ కథానాయిక. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు అత్యల్ప రేటింగ్ దక్కించుకున్న చెత్త వెబ్ సిరీస్ గా రాస్ భరి గురించి చెప్పుకుంటున్నారు. స్వరా భాస్కర్ పోషించిన పాత్ర ఎంతో వివాదాస్పదం. తన చుట్టూ ఉన్న సంస్కృతి సంప్రదాయాల్ని మంటగలిపే వేశ్య తరహా పాత్రను స్వరా భాస్కర్ పోషించింది. కథానాయిక తన ప్రాంతంలోని పురుషులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. అది కాస్తా రొమాంటిక్ అనే కంటే ప్రమాదకరం అన్న విమర్శలే వినిపిస్తున్నాయి.
ఈ తరహా లైంగిక ఆలోచనలు కలిగిన యువతుల వ్యవహారాల్ని ఇలా సినిమా రూపకంగా చూపించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంతో అసభ్యకరమైన కంటెంట్ కావడంతో ప్రేక్షకుల నుంచి చీవాట్లు ఎదురవుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అంటేనే శృంగారం ఒక్కటేనా? అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక ఈ వివాదాన్ని అటుంచితే... `రాస్ భరి` వెబ్ సిరీస్ టీనేజర్లను చెడు దారి పట్టించేంత ప్రమాదకరంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.