• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్-త్రివిక్రమ్ సినిమాలో...

పవన్-త్రివిక్రమ్ సినిమాలో తమిళ కమెడియన్

By - Tupaki Desk
Update: 2017-03-28 08:01 GMT
కాటమరాయుడు’ తర్వాత పెద్దగా గ్యాప్ ఏమీ తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ తొలి వారంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను మొదలుపెట్టేయబోతున్నాడు. పోయినేడాది మేలోనే ‘అఆ’ సినిమాను పూర్తి చేసేసిన త్రివిక్రమ్.. అప్పట్నుంచి పవన్ సినిమా మీదే పని చేస్తున్నాడు. స్క్రిప్టు పక్కాగా రెడీ చేసుకుని.. పవన్ ఎప్పుడు ఖాళీ అవుతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు పవన్ ఫ్రీ అయిపోయాడు. దీంతో ఆలస్యం చేయకుండా సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు. ఈ చిత్రానికి నటీనటులు.. సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయింది.

పవన్ సరసన హీరోయిన్ కోలీవుడ్ భామ కీర్తి సురేష్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతాన్నందించేది కూడా కోలీవుడ్ వాడే. అనిరుధ్ రవిచందర్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ ప్రముఖ తమిళ కమెడియన్ కీలక పాత్రకు ఎంపికవడం విశేషం. ఆ కమెడియన్ పేరు.. రోబో శంకర్. తమిళ సినిమాలు ఫాలో అయ్యే వారికి రోబో శంకర్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. టీవీ రియాల్టీ షోలతో పాపులర్ అయిన రోబో శంకర్.. తనదైన టిపికల్ కామెడీతో సినిమాల్లోనూ మంచి పేరు సంపాదించాడు. కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలతో అతను తెలుగు వాళ్లకు పరిచయమే. సూర్య సినిమా ‘ఎస్-3’లో రోబో శంకర్ నటన మెచ్చి త్రివిక్రమ్ ఈ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడట. త్రివిక్రమ్ నుంచి తనకు ఫోన్ వచ్చిన మాట వాస్తవమే అని రోబో శంకర్ కూడా కన్ఫమ్ చేశాడు. తెలుగులోకి డబ్ అవుతున్న ‘ప్రేమ లీల పెళ్లి గోల’ చిత్రంలోనూ తన పెర్ఫామెన్స్ ఒకసారి చూడమని త్రివిక్రమ్ కు చెప్పానని.. ఆ తర్వాతే ఈ సినిమాకు సైన్ చేస్తానని రోబో శంకర్ అన్నాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Robo Shankar 
  • Pawan kalyan 
  • Trivikram 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS