• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూప‌ర్ హీరో సిరీస్ తో...

సూప‌ర్ హీరో సిరీస్ తో పీసీ కంబ్యాక్

By - Tupaki Desk
Update: 2019-08-22 13:37 GMT
నిక్ జోనాస్ ని పెళ్లాడిన త‌ర్వాత ప్రియాంక చోప్రా పూర్తిగా ఫ్యామిలీ ఎఫైర్స్ కే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్యం విదేశీ విహారాల‌తో ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ జోడీ బిజీబిజీగా ఉన్నారు. `లైఫ్ ఈజ్ సెల‌బ్రేష‌న్` అన్న తీరుగా జాలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో ఆ ఫోటోలు- వీడియోలు అభిమానులకు షేర్ చేస్తున్నారు. అంత‌వ‌ర‌కూ ఓకే కానీ క‌థానాయిక‌గా పీసీ కెరీర్ మాటేమిటి?  ఇక‌పై అయినా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా? అంటే అందుకు సంబంధించి తాజాగా స‌మాచారం అందింది.

`క్వాంటికో` వెబ్‌ సిరీస్ తో ప్రియాంక చోప్రా గ్లోబ‌ల్ స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకుంది. ఆ త‌ర్వాత డ్వేన్ జాన్స‌న్ `బేవాచ్`లో క‌థానాయిక‌గా న‌టించింది. అటుపై నిక్ జోనాస్ తో ప్రేమాయ‌ణం.. పెళ్లి ఆలోచ‌న‌ల‌తో స‌ల్మాన్ `భార‌త్` చిత్రంలో అవ‌కాశాన్ని వ‌దులుకుంది. ప్ర‌స్తుతం పీసీ త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న వెలువ‌డనుంద‌ని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న సూప‌ర్ హీరో ఫిలిం `వియ్ కెన్ బి హీరోస్`లో ప్రియాంక చోప్రా ఓ కీల‌క పాత్ర పోషించ‌నుంది.

ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తి రేకెత్తించేదే. ఈ భూమ్మీద ఉన్న సూప‌ర్ హీరోస్ అంద‌రినీ ఏలియ‌న్స్ బంధించేసి లోక వినాశ‌నానికి తెర‌తీస్తే ఆ ప్ర‌మాదం నుంచి కాపాడేందుకు కొంద‌రు చిన్నారులు చేసిన ప్ర‌య‌త్నం ఎలాంటిది? అన్న‌దే క‌థాంశం. అకీరా ఫిన్లే-నాథ‌న్ బ్లెయిర్- ఆండీ వాకెన్- హ‌లా ఫిన్లే త‌దిత‌రులు న‌టిస్తున్నారు. స్పై కిడ్స్- సిన్ సిటీ లాంటి భారీ చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ రోబ‌ర్ట్ రోడ్రిగ్  `వియ్ కెన్ బి హీరోస్`కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ హాలీవుడ్ సినిమాతో పాటుగా `ది స్కై ఈజ్ పింక్` అనే బాలీవుడ్ చిత్రంలోనూ పీసీ న‌టిస్తోంది. ఇందులో ఫ‌ర్హాన్ అక్త‌ర్- జైరా వాసిమ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేసుకుంటోంది. అక్టోబ‌ర్ 11న రిలీజ్ కానుంది.


Tags:    
  • Robert Rodriguez 
  • Superhero 
  • Priyanka Chopra 
  • Captain Marvel Akira Akbar 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS