ఇప్పట్లో మహేష్ - త్రివిక్రమ్ కలిసే ఛాన్సే లేదా...?

Update: 2020-04-11 05:30 GMT
ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే ఊపులో ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే చేసాడు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్ రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో తన షూటింగ్ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ తో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాను పక్కన పెట్టాడని.. తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ తో ఉంటుందని వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇంతకముందు 'అతడు', 'ఖలేజా' సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలు ఇప్పటికీ టీవీల్లో విపరీతమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి. 'ఖలేజా' తర్వాత వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి పనిచేయలేదు. ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయని, అందుకే కలిసి పనిచేయడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేయబోతున్నారని న్యూస్ బయటకి రావడంతో అభిమానులు సంతోషానికి గురయ్యారు. ఇప్పటికే మహేష్ - త్రివిక్రమ్ మీట్ అయి స్టోరీపై డిస్కషన్ చేసారని, ఈ సినిమా ఇమ్మీడియేట్ గా పట్టాలెక్కించమని మహేష్ కోరినట్లుగా న్యూస్ స్ప్రెడ్ అయిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు ఇవి బేస్ లెస్ రూమర్స్ అని తెలుస్తోంది. త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే ఉంటుందని.. దీనికి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారని సమాచారం.

త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా పక్కన పెడుతున్నాడని న్యూస్ రావడం ఇదేమి మొదటిసారి కాదు. ఇంతకముందు కూడా 'ఆర్.ఆర్.ఆర్.' లేట్ అవుతుండటంతో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో మూవీ ఓకే చేసాడని.. కొన్ని రోజులకి సూపర్ స్టార్ మహేష్ తో నెక్స్ట్ సినిమా ఉండబోతోందని న్యూస్ స్ప్రెడ్ అయింది కూడా. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపైనే ఉందని, ఈ సినిమాలో తారక్ ని స్టైలిష్ లుక్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడని సమాచారం. వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంభందించి పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.
Tags:    

Similar News