తూనీగ తూనీగ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది రియా చక్రవర్తి. కానీ ఆ సినిమా ఫ్లాపయ్యాక ఈ బ్యూటీ బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంది. అక్కడ మహేష్ భట్ లాంటి ప్రముఖ నిర్మాత అండదండలతో కొన్ని అవకాశాలు అందుకుంది. ఆ క్రమంలోనే సుశాంత్ సింగ్ తో స్నేహం ప్రేమ వగైరా వగైరా ఎపిసోడ్స్ తెలిసినవే.
సుశాంత్ సింగ్ బలవన్మరణంలో రియా పాత్ర ఉందన్న అనుమానాలు సహా డ్రగ్స్ వ్యవహారంలోనూ రియా అరెస్ట్ అయ్యింది. నెలరోజుల జైలు అనంతరం బెయిల్ పై విడుదలైంది. రియాపై కేసులేవీ వందశాతం ప్రూవ్ కాకపోవడంతో ఆమె ప్రస్తుతం బయట ఉన్నారు. రియా ప్రస్తుతం కెరీర్ పై దృష్టి సారించారని బాలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ నటించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
జైలు జీవితం వివాదాలతో రియా పేరు ముడిపడి ఉంది కాబట్టి బాలీవుడ్ లో ఎవరూ అవకాశాలివ్వడం లేదని తెలుస్తోంది. ఆ క్రమంలోనే తను టాలీవుడ్ నిర్మాతలకు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తోందట. రియాకు ఇంతకుముందు తెలుగు సినీనిర్మాతలతో పరిచయాలున్నాయి. ఆ క్రమంలోనే ఇక్కడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఎవరైనా అవకాశం ఇచ్చి అధికారికంగా సినిమాని ప్రకటిస్తే అప్పుడే ఈ గుసగుసలకు ప్రూఫ్ లభించినట్టు.