తెలుగు నిర్మాత విషయంలో రియా అలా ప్రవర్తించలేదట
సుశాంత్ మృతి తర్వాత రియా చక్రవర్తి పై పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి మృతికి పూర్తిగా రియా చక్రవర్తి కారణం అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో రియాకు సంబంధం ఉంది అన్నట్లుగా ఎన్ సీ బీ వారు అనుమానించారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా సాక్ష్యాధారాలు కూడా లభించంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సమయంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం ఒక తెలుగు నిర్మాతను ఆమె ఇబ్బంది పెట్టింది అనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి.
తెలుగు ఈమె కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న 'సూపర్ మచ్చి' సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు ఎంపిక అయ్యిందట. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత రియా సినిమా పూర్తి అవుతుందనే నమ్మకం లేదంటూ తప్పుకుందట. ఆ సమయంలో పెద్దల వద్దకు ఆ వివాదం వెళ్లిందట. అయినా కూడా ఆమె నో చెప్పడంతో మరో హీరోయిన్ ను నటింప జేస్తున్నారు అనేది పుకార్ల సారాంశం. కాని సూపర్ మచ్చి విషయంలో రియా వ్యవహరించిన తీరు గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదు అంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అది కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని రియా గురించి ప్రస్తుతం ఏం చెప్పినా ఈజీగా నమ్మేస్తారనే ఉద్దేశ్యంతో కొందరు ఈ ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేశారేమో అంటున్నారు. తెలుగు సినిమా వివాదం గురించి నిర్మాత స్పందించడంతో రియాకు ఈ ఒక్క విషయంలో మాత్రం క్లీన్ చీట్ వచ్చినట్లుగా భావించవచ్చు.