ఫోటో స్టోరిః తూనీగ డోస్ పెంచింది

Update: 2017-04-25 05:17 GMT
చాలామంది భామలు టాలీవుడ్ తో అరంగేట్రం చేసి.. ఆ తర్వాత బాలీవుడ్ కి ఎగిరిపోతుంటారు. అలా ఎగిరిపోయిన సుందరాంగుల్లో ఈ తూనీగ రియా చక్రవర్తి కూడా ఉంటుంది. టీవీతో మొదలు పెట్టి.. మోడలింగ్ లోకి అల్లుకుని.. టాలీవుడ్ లో పలకరించి.. బాలీవుడ్ లో జెండా పాతేసేందుకు ప్రయత్నిస్తున్న రియా.. స్కిన్ షోకి కొత్త స్పెల్లింగ్ కనిపెట్టే పనిలో బిజీగా ఉంటోంది.

ఐదేళ్లుగా బాలీవుడ్ లో ఉన్నా..ఇప్పటికి రెండు సినిమాలు మాత్రమే చేసింది రియా చక్రవర్తి. ఇప్పుడో రెండు మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. అందుకే ఈ సినిమాలు రిలీజ్ అయ్యే నాటికి.. తన కెరీర్ కి తానే బూస్ట్ పట్టించేయాలని ఫిక్స్ అయిన ఈ తూనీగ.. తన అందాల నుంచి ఒక్కక్క అస్త్రాన్ని బయటకు తీస్తూ.. వస్త్రాలను పక్కకు తోసేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తోంది. నేలపై కూర్చుని.. ఓ కాలును ఆరజాపి.. భుజంపై డ్రస్ నిలవనట్లుగా ఓ పోజ్ ఇచ్చి.. మత్తెక్కించే కళ్లతో చూస్తోంది రియా చక్రవర్తి. ట్రాన్స్ పరెంట్ టాప్.. బాటమ్.. లను ధరించడంతో అందాల డోస్ బాగానే ఉంది.

నా లేటెస్ట్ పిక్చర్ చూస్కోండి అని చెప్పి మరీ ఈ ఫోటోను షేర్ చేసింది తూనీగ. ఇప్పుడీ భామ చేతిలో హాఫ్ గాళ్ ఫ్రెండ్.. బ్యాంక్ చోర్ మూవీస్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది సక్సెస్ అయినా.. తన కెరీర్ లోకి వెలుగులు వచ్చేస్తాయని నమ్మకంగా ఉంది రియా చక్రవర్తి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News