• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లి ప‌ర‌మార్థం...

పెళ్లి ప‌ర‌మార్థం గొప్ప‌గా చెప్పిన ఆర్జీవీ

By - Tupaki Desk
Update: 2019-12-24 10:32 GMT
పెళ్లి పై ఆర్జీవీ ని అభిప్రాయం అడిగితే ఆయ‌న ఎలా స్పందిస్తారో తెలిసిందే. పెళ్లి మాట అటుంచితే ఆయ‌న నోటి నుంచి ఓ ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం దొర్లింది. అస‌లు మీరు సినిమాలు- వోడ్కా.. ఈ రెండింట్లో దేన్ని వదిలేస్తారు? అని అడిగేస్తే... ``ఇదో స్టుపిడ్ ప్రశ్న అంటూ తిట్టిపారేయ‌డ‌మే గాక‌.. నేను వోడ్కా తాగుతూ సినిమాలు తీస్తా.. సినిమాలు తీస్తూ వోడ్కా తాగుతూ... నా అభిప్రాయంలో ఆ రెండూ మ్యారీడ్..`` అంటూ ఆస‌క్తి క‌ర‌మైన స‌మాధాన‌మే ఇచ్చారు. ఆర్జీవీ తెర‌కెక్కించిన `బ్యూటిఫుల్` ప్ర‌చార‌ ఈవెంట్లో ఆయ‌న పైవిధంగా స్పందించారు.

మీరు తీసిన‌ట్టే మీ జీవితంపై నెగెటివ్ గా బ‌యోపిక్ తీస్తే..? అని ప్రశ్నిస్తే.. అస‌లు నా బ‌యోపిక్ తీయాలంటే న‌న్ను అడ‌గ‌న‌వ‌స‌రం లేద‌ని త‌న‌దైన శైలి లో ఆన్స‌ర్ ఇచ్చారు. నేనెవ‌రినీ అడిగి తీయ‌ను. చంద్ర‌బాబుని.. ఎన్టీఆర్ ని .. ల‌క్ష్మీ పార్వ‌తిని అడిగి తాను బ‌యోపిక్ లు తీయ‌లేద‌ని అన్నారు. ఐడియా వ‌స్తే తీసే స్వేచ్ఛ అంద‌రికీ ఉండాల‌ని వ్యాఖ్యానించారు.

శ్రీదేవి - శశికళ ఎవ‌రిపై బ‌యోపిక్ తీస్తున్నారు? అంటే.. శ్రీ‌దేవి పై ఎప్ప‌టికీ బ‌యోపిక్ తీయ‌న‌ని ఎందుకంటే అలాంటి మ‌రొక అమ్మాయి దొర‌క‌ద‌ని అన్నారు. ఇక శ్రీ‌దేవిని.. శ‌శిక‌ళ‌ ను పోల్చ‌డం లో అర్థం లేద‌ని.. నేను అనుకుంటున్న 10-20 బ‌యోపిక్ ల‌లో శ‌శిక‌ళ బ‌యోపిక్ ఒక‌టి అని అన్నారు. త‌న‌కు నేను అంత ప్రాధాన్యత ఇవ్వడంలేద‌నీ అన్నారు. జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్లే రెండే రెండు అంశాలు అమ్మాయి అందం.. మగాడి పవర్...!! అంటూ త‌న‌దైన శైలిలో సూత్రీక‌రించిన ఆర్జీవీ.. స్వర్గంలో నాకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి శ్రీదేవి సమాధి ఎక్కుడుందో తెలుసుకుని ఆమె పక్కనే నాకు ప్లేస్ ఖాళీగా ఉంచ‌మని చెప్తాను!!! అంటూ వేదిక ఆద్యంతం న‌వ్వులు పూయించారు. ఆర్జీవీ స్పాంటేనియ‌స్ పంచ్ లు జోకులు హ్యూమ‌ర్ సెన్స్ కు అంద‌రూ ప‌డి ప‌డీ న‌వ్వారు అంతే.


Tags:    
  • Rgvs Opinion On Marriage 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Rgv Latest Movies 
  • Rgv Movies 
  • Rgv Thug Life Videos 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS