• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎవరో భార్య కారణంగానే...

ఎవరో భార్య కారణంగానే కరోనా వచ్చిందని ఆర్జీవి ట్వీట్

By - Tupaki Desk
Update: 2020-03-27 13:30 GMT
రామ్ గోపాల్ వర్మ...ఈ పేరే సంచలనం. ఎప్పుడు ఏమి చేస్తాడో ఎవరీ తెలియదు. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా ఎలా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడటం దాన్ని వివాదాస్పదం చేయడం వర్మ నుంచే చూసి నేర్చుకోవాలి. అంతేకాదు తనకు గిట్టని వాళ్లపై ఏదో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు ముందు నుంచి అలవాటు. అందుకే ఆయన్ని అందరూ వివాదాస్పద దర్శకుడు అంటారు. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నుంచి ఆయన పూటకో ట్వీట్‌తో సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కరోనాపై మరో ట్వీట్ చేశాడు. కరోనా వైరస్ పంపించమని ఎవరి భార్యో గట్టిగా ప్రార్థించినట్లు తాను అనుమానిస్తున్నానని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఎందుకంటే అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి, పబ్బులు బార్లు మూతపడ్డాయి, ఫ్రెండ్స్ తో కలిసి చిట్టా పాటి చేయడానికి లేదు, వర్క్ విషయంలో అబద్ధాలు చెప్పడానికి కూడా లేకుండా పోయింది, అన్నిటికంటే ముఖ్యంగా కేవలం భార్యతోనే గడపాల్సి వస్తుంది అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేసాడు.

ఇంతకుముందు 'భూమిపై ఉన్న జీవుల్లో మనుషులు మాత్రమే తమ సొంత ప్రాంతంలో ఉండకుండా ఎల్లప్పుడూ సంచారం చేస్తుంటారన్నారు. ఉన్నదాన్ని రెట్టింపు చేసుకోవాలని ఎల్లప్పుడు ప్రయాణిస్తూ భూమికి సంబంధించిన సహజ వనరులను నాశనం చేస్తుంటాడు. ఇదే రకమైన పని చేసే మరో జీవి వైరస్‌ మాత్రమేనన్నారు. భూ గ్రహానికి పట్టిన జబ్బు మానవులు అయితే మానవులకు పట్టిన రోగం వైరస్‌' అని ట్వీట్ చేసాడు. ఇదిలావుండగా కరోనా విజృంభణ తో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నప్పటికీ క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యారు. భారత దేశంలో కరోనా వైరస్ నిర్మూలించేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పలువురు సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియా ద్వారా అవగాహనా సూచనలు ఇస్తున్నారు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • RGV 
  • twitter 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS