మ‌ర‌ణించిన హీరో బ‌యోపిక్‌ సిద్ధ‌మ‌వుతున్న ఆర్జీవీ!

Update: 2021-04-08 04:30 GMT
ప‌బ్లిసిటీ ఎక్క‌డుంటే.. రామ్ గోపాల్ వ‌ర్మ అక్క‌డుంటాడు. వివాదాస్ప‌ద అంశాల‌నే క‌థావ‌స్తువులుగా మ‌లుచుకుని సినిమాలు తీయ‌డంలో వ‌ర్మ త‌ర్వాతే ఎవ‌రైనా! ఇప్ప‌టికే.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, ప‌వ‌ర్ స్టార్‌, మ‌ర్డ‌ర్‌, దిశ అంటూ.. సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌మైన‌ అంశాల‌ను సినిమాలుగా తీసిన ఆర్జీవీ.. మ‌రోసారి అలాంటి స్టోరీతోనే సినిమా తీసేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. నెపోటిజం, డ్ర‌గ్స్ వంటి అంశాల‌తో.. సుశాంత్ మ‌ర‌ణ‌వార్త యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పుడు సుశాంత్ సింగ్ జీవితంపై సినిమా తెర‌కెక్కించేందుకు ఆర్జీవీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలో సుశాంత్ ల‌వ్ స్టోరీ మొద‌లు.. సినీ ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న రాజ‌కీయాలు, డ్ర‌గ్స్ వంటి అంశాల‌ను కూడా చూపించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆ హీరో జీవితం ఆధారంగా సినిమా నిర్మిస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించాడు ఆర్జీవీ. కాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి, ఈ సినిమాను ఏ రేంజ్ లో తెర‌కెక్కిస్తాడో చూడాలి.
Tags:    

Similar News