బ్రూస్ లీ స్ఫూర్తితో మార్షల్ ఆర్ట్స్ కింగ్ కావాలనుకుని కాలేక తడబడిన ఆర్జీవీ తాను అనుకున్నది సాధించలేక ఏం అయ్యాడో అందరికీ తెలిసినదే. ఆర్జీవీ స్టార్ డైరెక్టర్ అయ్యి ఎందరో హీరోలతో సంచలనాలు తీశారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన దారి తప్పి డీగ్రేడ్ సినిమాలు తీయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదంతా సరే కానీ.. ఇప్పుడు ఆర్జీవీ హీరో అవుతున్నారన్నది మరో సెన్సేషన్ కాబోతోంది. ఇంతకుముందే అతడు నటించాడు. కానీ ఈసారి పూర్తి హీరోగా అభిమానుల్ని అలరించనున్నారని కథనాలొస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆర్జీవీ జిమ్ లో ఫుల్ గా కసరత్తులు చేస్తూ టూ ఇన్ వన్ ప్లాన్ వేశారు.
ఇదిగో ఇలా కోవిడ్ టైమ్స్ లో ఐరన్ పంపింగ్ అంటూ కండబలం ఈమోజీల్ని ప్రదర్శిస్తున్నారు. అయితే కోవిడ్ మీదకు నెట్టి అసలు విషయం దాచిన ఆర్జీవీని కనిపెట్టేశాం. అదంతా కోవిడ్ నిరోధక శక్తి కోసం కాదు.. అతడు హీరో అవ్వాలని ఉవ్విళ్లూరుతున్నందునే అని గుట్టు లీకైంది. సాధ్యమైనంత తొందర్లోనే ఆర్జీవీ హీరోగా ఒక సినిమాని ప్రకటించనున్నారు.