ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ 65 కోట్లా?

Update: 2015-07-16 04:08 GMT
`బాహుబ‌లి` కోసం ప్ర‌భాస్ తీసుకొన్న రెమ్యున‌రేషన్ రూః 25కోట్లు అని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో నిన్న మొన్న మాట్లాడుకొన్నారు. కానీ రామ్‌గోపాల్ వ‌ర్మ కొత్త లెక్క చెప్పుకొచ్చాడు. బాహుబ‌లిలో న‌టించినందుకుగానూ ప్ర‌భాస్‌కి అందిన మొత్తం రూః 65కోట్లు అని ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. మ‌రి ఆయ‌న చెప్పిందే నిజ‌మైతే సౌత్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకొన్న క‌థానాయ‌కుడిగా ప్ర‌భాస్ రికార్డు కొట్టిన‌ట్టే అవుతుంది.

 `బాహుబ‌లి` కోసం ప్ర‌భాస్ రెండేళ్లు కేటాయించాడు. `మిర్చి`లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్ర‌భాస్ అలా ఒకే సినిమాకోసం యేళ్ల‌కు యేళ్లు కేటాయించ‌డం చూసి ప‌రిశ్ర‌మ‌లో న‌లుగురు నాలుగు ర‌కాలుగా మాట్లాడుకొన్నారు. `బాహుబ‌లి`తో మేలంటూ  జ‌రిగితే రాజ‌మౌళికి జ‌రుగుతుంది, ప్ర‌భాస్‌కి ఏమొస్తుందంట అని కామెంట్లు చేశారు. కానీ ప్ర‌భాస్ మాత్రం ఆ మాట‌ల్ని ప‌ట్టించుకోలేదు. అభిమానులు డీలా ప‌డుతున్నా, వాళ్ల నుంచి ఒత్తిడి ఎదురైనా తాను అనుకొన్న‌ది చేశాడు ప్ర‌భాస్‌. ఎట్ట‌కేల‌కు రెండేళ్ల త‌ర్వాత `బాహుబ‌లి`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు ప్ర‌భాస్‌. అభిమానుల ఎదురు చూపుల‌కు ధీటుగానే తెర‌పై క‌నిపించాడు. సినిమాకి అంత‌ర్జాతీయ స్థాయిలో అప్లాజ్ వ‌స్తోంది.
 
బాహుబ‌లి ఇప్ప‌టికే రూః200కోట్ల‌కుపైగా వ‌సూళ్లు సాధించింది.  ఆ వ‌సూళ్లు ఇంకా భారీగా పెరిగే అవ‌కాశం కూడా ఉంది. అందుకే నిర్మాత‌లు ప్ర‌భాస్‌కి సినిమాలో షేర్ ఇవ్వాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకొన్న‌ట్టు  వ‌ర్మ ట్వీట్లను చూస్తే తెలుస్తోంది.  ``ప్ర‌భాస్ డ‌బ్బులేమీ తీసుకోకుండా రెండేళ్లు కేటాయించాడ‌ని మాట్లాడుకొన్న మన‌మంతా ఫూల్స్‌. ఆయ‌న తొలి పార్ట్‌కే 65కోట్ల షేర్ తీసుకొన్నాడు. ఇలా తీసుకొన్న‌వాళ్లు ఎవ‌రున్నారో చూపించండి?`` అని ట్వీట్ చేశాడు వ‌ర్మ‌.
Tags:    

Similar News