మహర్షికి రివర్స్ సెంటిమెంట్

Update: 2019-03-20 17:30 GMT
సాధారణంగా గతంలో వచ్చిన హిట్ సినిమాల టైటిల్స్ కొత్తవాటికి పెట్టుకుంటే విజయం సాధించిన దాఖలాలు చాలా తక్కువ. మల్లేశ్వరి-గీతాంజలి లాంటి ఏవో కొన్ని తప్ప చేదు ఫలితాలే ఎక్కువగా వచ్చాయి. శంకరాభరణం-మాయాబజార్-శత్రువు-గణేష్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే ఉంది. అయితే పెద్దగా ఆడని సినిమా టైటిల్ ఇప్పుడు పెడితే హిట్ అవ్వొచ్చు కదా అనే సందేహం కలగడం సహజం.

ఇప్పుడు మహర్షి విషయంలో ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఈ పేరు ఒక్కసారి వాడారు. 1988లో రాఘవని హీరోగా పరిచయం చేస్తూ వంశీ తీసిన ఈ మూవీ కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఆర్టిస్ట్ గా రాఘవకు అది ఇంటి పేరుగా మారితే ఇళయరాజా పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. స్రవంతి బ్యానర్ కు పేరైతే వచ్చింది కానీ ట్రాజెడీ క్లైమాక్స్ ఉన్న మహర్షి ఆశించిన విజయం అయితే అందుకోలేదు

ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. అప్పట్లో వచ్చింది లవ్ స్టోరీ అయితే ఇప్పుడు ఇది పక్కా ఎంటర్ టైనర్. సో సెంటిమెంట్ ప్రకారం చూసుకున్నా ఈ మహర్షితో ప్రిన్స్ ఖచ్చితంగా హిట్ కొడతాడని ఫాన్స్ నమ్ముతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న టీమ్ మే 9 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ మహర్షి వచ్చిన 21 ఏళ్ళకు ఈ మహర్షి వస్తున్నాడు.

సో ఇప్పటిదాకా వచ్చిన ట్రెండ్ కి భిన్నంగా సక్సెస్ కానీ టైటిల్ తో వస్తున్న మహర్షి గ్యారెంటీ బ్లాక్ బస్టర్ కొడతాడనే ధీమా అభిమానుల్లో కనిపిస్తోంది. ఇంకో నెలన్నర టైం ఉంది కాబట్టి ఎన్నికల హడావిడి తగ్గాక ప్రమోషన్ ని మొదలుపెట్టబోతున్నారు
Tags:    

Similar News