పవన్ రక్తం అన్నందుకు రేణుకు కోపం వచ్చింది
సోషల్ మీడియా లో మరోసారి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ అభిమానులను సున్నితంగా హెచ్చరించింది. రేణు దేశాయ్ చాలా రెగ్యులర్ గా తన పిల్లల ఫొటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు అకీరా తన చెల్లి ఆధ్యను ఎత్తుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోతో పాటు 1 2 3 అని లెక్కించే లోపు నీ ముందు ఉంటాను. ఇద్దరు క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరికి నేనున్నాను వారు నా సొంతం అంటూ క్యాప్షన్ పెట్టి ఫొటోను పోస్ట్ చేసింది.
ఆ ఫొటోకు ఒక నెటిజన్ స్పందిస్తూ ఎంతైనా వారిద్దరిలో ఉన్నది పవన్ కళ్యాణ్ రక్తం కదా అన్నట్లుగా కామెంట్ చేశాడు. ఆ కామెంట్ పై రేణు దేశాయ్ కౌంటర్ గా స్పందించింది. మీకు సైన్స్ సరిగా తెలుసో తెలియదో టెక్నికల్ గా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించే రక్తం నాది. మీకు సైన్స్ తెలిస్తే అలా మాట్లాడి ఉండరు అంటూ అతడి కామెంట్ కు సమాధానం గా రిప్లై ఇచ్చింది. రేణు రిప్లై కు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. కొందరు సమర్ధిస్తే మరి కొందరు వ్యతిరేకించారు.
రేణు కాస్త సీరియస్ గా వారిలో ఉన్నది నా రక్తం అంటూ కామెంట్ చేయడం తో మరో నెటిజన్ స్పందిస్తూ ఫ్యాన్స్ తో అంత కఠినంగా మాట్లాడటం సరికాదు మేడం అన్నాడు. దానికి కూడా రేణు రియాక్ట్ అయ్యింది. వారు నాలో ఉన్న అమ్మతనం పట్ల దురుసుగా కఠినంగా ఉంటే పర్వాలేదు. కాని నేను మాత్రం వారిపట్ల సాఫ్ట్ గా ఉండాలా అంటూ ప్రశ్నించింది. అకీరా కు సోదరి ప్రేమ.. ఆధ్యకు అన్నయ్య అకీరా ప్రేమ చాలానే దొరుకుతుంది.. ఎవరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.