తేదీల్ని లాక్ చేస్తున్నారు.. థర్డ్ వేవ్ రాకముందే!
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా చాలా సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ తేదీలు ప్రకటించి మరీ వెయిట్ చేస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కరోనా విజృంభణతో థియేటర్లకు లాక్ పడింది. నాటి నుంచి ఎక్కడి రిలీజ్ లు అక్కడే ఆగిపోయాయి. కొంత మంది నిర్మాతలు మంచి ఆఫర్ వస్తే ఓటీటీల్లో రిలీజ్ చేసుకున్నారు. బేరం కుదరని సినిమాలన్నీ అలా రిలీజ్ కు వెయిటింగ్ లో ఉండిపోయాయి. తాజాగా పరిస్థితులు అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో మళ్లీ నిర్మాతలు తమ సినిమాల్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సెకెండ్ వేవ్ బాగా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు వ్యాక్సినేషన్ తో ప్రజల్లో కొంత ధీమా పెరిగింది.
దీంతో తెలంగాణ లో లాక్ డౌన్ ఎత్తేసారు. ఏపీలో రాత్రి పూట మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతోంది. సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేసుకోవచ్చిన కూడా ప్రభుత్వం అదేశాలిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా 100 శాతం ఆక్యెపెన్సీతో రిలీజ్ చేసుకోవొచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. థియేటర్లు అన్ లాక్ చేయడం విషయంలో కాస్త సందిగ్ధత నెలకొన్న్పటకి తెలంగాణ ప్రభుత్వ అధికారులతో నిర్మాతలు భేటి అయిన నేపథ్యంలో వాళ్ల సమస్యల్ని వాళ్లు చెప్పుకోవడంతో ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత లభించింది. ఆ విషయంలో కాస్త క్లారిటీ లేనప్పటికీ రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు లేని నేపథ్యంలో నిర్మాతలంతా తాజాగా సినిమాలు యథావిధిగా రిలీజ్ చేయాలని సన్నాహాకాలు చేసుకుంటున్నారుట.
రిలీజ్ తేదీలు వచ్చే వారం నుంచి ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొంత మంది అగ్ర నిర్మాతలు తమ సినిమా డేట్లను లాక్ చేసుకున్నట్లు సమాచారం. ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలన్న దానిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు వినిపిస్తోంది. అంటే ఆగస్టు పూర్తయ్యే లోపు రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలన్నీ రిలీజ్ చేసేలా ప్రణాళికలు వేసుకుని ఉండొచ్చు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందని ఇప్పటికే డబ్ల్యూహెచ్ ఓ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈలోపే సినిమాన్నీ రిలీజ్ కావాల్సి ఉంటుంది.
అయితే కరోనాని మించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్టు రేటు సమస్య పై చర్చ సాగుతోంది. ఏపీ సర్కార్ టిక్కెట్టు రేటుపై దిగి రానని అంటోంది. ప్రభుత్వానికి చెప్పాకే టిక్కెట్టు రేట్లు పెంచాలని హుకుం జారీ చేసింది. దీంతో ఏపీలో థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఏపీలో తెరవకపోతే తెలంగాణలో తాము కూడా తెరవలేమని అన్నిచోట్లా ఒకటే టిక్కెట్టు రేటు ఉండాలని తెలంగాణ ఫిలింఛాంబర్ డిమాండ్ చేస్తోంది. ఓవరాల్ గా ఈ సీజన్ లో రిలీజ్ లపై కొంత సందిగ్ధత నెలకొంది. థర్డ్ వేవ్ వచ్చేందుక నెలరోజుల సమయం ఉంది కాబట్టి ఈలోగానే కొంతవరకూ రిలీజ్ లతో గట్టెక్కేదెలా? అన్నది చూడాలి.
విరాటపర్వం- టక్ జగదీష్ -లవ్ స్టోరి- ఆచార్య-నారప్ప- పుష్ప- కేజీఎఫ్ 2- ఆర్.ఆర్.ఆర్.. ఇలా అన్నీ క్రేజు ఉన్న చిత్రాలు వెయిటింగులో ఉన్నాయి. వీటితో పాటు మిడ్ రేంజు సినిమాలు మరో డజను పైగానే ఉన్నాయి. ఇవన్నీ రిలీజ్ కావాలంటే ముందు టిక్కెట్టు రేటు పెంపు పై ఏపీ ప్రభుత్వం నిర్ణయం వెలువడాల్సి ఉంటుంది. రేట్ల పెంపునకు ఓకే అయితే వెంటనే ఏపీ-తెలంగాణలో సినిమా రిలీజ్ లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆక్యుపెన్సీ అనేది అస్సలు సమస్య కానే కాదు.