వారణాసి నుండి మరో సర్ప్రైజ్.. అంచనాలు మించుతుందా!
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి గ్లోబల్ అభిమానులను తనవైపు తిప్పుకున్నారు.;
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి గ్లోబల్ అభిమానులను తనవైపు తిప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి వచ్చే తదుపరి చిత్రం కోసం ప్రపంచస్థాయిలో అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. ఆఫ్రికన్ అడవులలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ అభిమానులలో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.
ఇదివరకే గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక ఈవెంట్ ను నిర్వహించి సినిమాపై అంచనాలు పెంచిన రాజమౌళి.. ఈ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు , ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ లకు సంబంధించిన ఫస్ట్ లుక్ లతో పాటు వారి పాత్రలను కూడా రివీల్ చేసి మరింత అంచనాలు పెంచారు పైగా ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా ప్రకాష్ రాజు మరోసారి నటిస్తుండడంతో వీరిద్దరి కాంబినేషన్ ను మళ్ళీ తెరపై చూడబోతున్నామనే హైప్ అభిమానులలో పెరిగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో సర్ప్రైజ్ న్యూస్ అభిమానులను సంతోషపరుస్తోంది. గత ఏడాది జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో 2027 సమ్మర్ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.
ఇకపోతే డివోషనల్ టచ్ తో కూడా రాబోతున్న ఈ చిత్రం నుండి ఒక బిగ్ అప్డేట్ మహాశివరాత్రి రోజు (ఫిబ్రవరి 16)వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. పైగా ఇందులో మహేష్ బాబు రుద్ర అనే ఒక పవర్ఫుల్ పాత్రతో పాటు మరో నాలుగు పాత్రలలో విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నారని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే రుద్ర క్యారెక్టర్ లో నటిస్తున్నారు కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తే బాగుంటుందని అటు చిత్ర బృందం కూడా ఆలోచిస్తోందట. ఒకవేళ ఆరోజున విడుదల తేదీని అనౌన్స్మెంట్ చేయలేకపోతే శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26వ తేదీన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అటు గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకేక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. మరోవైపు ఈ వారణాసి చిత్రంపై సౌత్ సినీ పరిశ్రమమే కాదు బాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా ఆసక్తి కనబరుస్తోందనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ లో అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది వారణాసి. ప్రస్తుతం అటు కలెక్షన్ల పరంగా ఇటు కంటెంట్ పరంగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు సాంస్కృతికంగా కూడా పునాది వేస్తుందని అటు కమర్షియల్ గా మరింత సక్సెస్ సాధిస్తుందని బాలీవుడ్ సినీ పరిశ్రమ భావిస్తోంది
ఎందుకంటే గత కొంతకాలంగా రీమేక్ చిత్రాలు ఫ్రాంచైజీలు వంటి భారీ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతూ బాలీవుడ్ పరిశ్రమ అలసిపోయింది. అందుకే ఒక కొత్త కథనాన్ని సృజనాత్మకంగా తెరకెక్కిస్తే రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని కూడా చెబుతోంది. అయితే తొలిసారి మహేష్ బాబు పాన్ ఇండియా రంగంలోకి అడుగుపెట్టడం.. ఇప్పటికే బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ఇండియన్ సినిమాకు ఒక ఉనికిని తీసుకొస్తుంది అని అటు బాలీవుడ్ కూడా బలంగా నమ్ముతోంది.. దీనికి తోడు ప్రియాంక చోప్రా కూడా ఈ ప్రాజెక్టులోకి భాగం అవడంతో బాలీవుడ్ పేరు కూడా మారుమ్రోగే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ పరిశ్రమ ఆలోచిస్తుంది.. ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుందంటే మాత్రం అటు సౌత్ ఇటు నార్త్ పరిశ్రమల జోరు మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.