• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరులో అది నాకు బాగా...

చిరులో అది నాకు బాగా న‌చ్చిందంటున్న రెజీనా!

By - Tupaki Desk
Update: 2022-07-07 15:30 GMT
రెజీనా కసాండ్రా.. తెలుగు, త‌మిళ సినీ ప్రియుల‌కు ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ మనసులో శృతి` మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన రెజీనా.. `పిల్లా నువ్వు లేని జీవితం`, `సుబ్రహ్మణ్యం ఫర్ సేల్` లాంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ లో సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది.

మ‌రోవైపు కోలీవుడ్ లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `అన్యాస్ ట్యుటోరియల్` అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వేదిక‌గా స్ట్రీమింగ్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ కు చ‌క్క‌టి స్పంద‌న ల‌భిస్తోంది. ఇక‌పోతే రెజీనా తాజాగా పాపుల‌ర్ టీవీ షో `ఆలీతో సరదాగా`లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ఎన్నో ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌ను సైతం అంద‌రితోనూ షేర్ చేసుకుంది.

అయితే ఈ క్ర‌మంలోనే హోస్ట్ ఆలీ `ఆచార్య సినిమాలో మెగా స్టార్ చిరంజీవి గారితో క‌లిసి ప‌ని చేయడం ఎలా అనిపించింది..?` అని ప్ర‌శ్నించాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ చిత్ర‌మే `ఆచార్య‌`. ఇందులో `సానా క‌ష్టం` అనే స్పెష‌ల్ సాంగ్ లో రెజీనా చిరుతో క‌లిసి చిందులేసింది.

ఈ నేప‌థ్యంలోనే ఆలీ చిరుతో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ప్ర‌శ్నించ‌గా.. రెజీనా బ‌దులిస్తూ `ఈ వ‌య‌సులోనూ చిరంజీవి గారు ఏ విషయాన్ని అయినా.. చాలా త్వరగా నేర్చుకుంటారు. అది నాకు బాగా న‌చ్చింది. ఆ విషయంలో ఆయనను మెచ్చుకోవాల్సిందే. ఆయ‌నతో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

కాగా, రెజీనా సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ  తెలుగు, త‌మిళ భాష‌ల్లో `నేనే నా` అనే చిత్రం చేస్తోంది. తెలుగులో `శాకినీ ఢాకినీ` అనే మూవీతో పాటు త‌మిళంలో ఓ మూడు ప్రాజెక్స్ట్ ను టేక‌ప్ చేసింది. అలాగే మ‌రోవైపు బాలీవుడ్ లో `షూర్ వీర్` వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. కనిష్క్ వర్మ ఈ సిరీస్ ను రూపొందించారు. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ సిరీస్‌ ట్రైలర్ మంచి ఆదరణ ద‌క్కించుకుంది.  జూలై 15 నుంచి హాట్ స్టార్ లో ఈ సిరీస్  స్ట్రీమింగ్ కాబోతోంది.
Tags:    
  • Tollywood 
  • actress 
  • ReginaCassandra 
  • chiranjeevi 
  • latestnews 
  • telugunews 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS