ఇంతకీ రెజీనా ఎవర్ని ప్రేమించింది?

Update: 2016-08-26 04:15 GMT
అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయగానే.. సందీప్ కిషన్ అండ్ రెజీనా కసాండ్రా మధ్యన టట్టడాయ్ అన్నారు. ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తో అమ్మడు తరచూ కనిపిస్తుండటంతో.. ఈ ఇద్దరి మధ్యనా టట్టడాయ్ అన్నారు. కట్ చేస్తే.. రెజీనా అందరూ నాకు ఫ్రెండ్స్ మాత్రమే అనే క్లారిటీ ఇచ్చింది. అయితే మనం మాట్లాడుతోంది ఈ రూమర్ల గురించి ఎంతమాత్రం కాదండోయ్.

ఇప్పుడు అందరూ ఆసక్తిగా తెలుసుకోవాలని అనుకుంటోంది దేని గురించి అంటే.. అసలు డస్కీ బ్యూటి రెజీనా ఎవర్ని ఇష్టపడింది? అదేనండీ ''జ్యో అచ్చుతానంద'' సినిమాలో అన్నాదమ్ములు నారా రోహిత్ అండ్ నాగ శౌర్య ఇద్దరూ ఈమెకే లైన్ వేస్తున్నారు. ఇద్దరూ కలసి ఒకేసారి ఈ డెంటిస్ట్ ను పడేయాలని చూస్తున్నారా? ఇంతకీ చివరకు రెజీనా ఎవరితో ప్రేమలో పడుతుంది? ఈ అన్నదమ్ముల్లో ఎవరిని పెళ్లిచేసుకోబోతోంది? ఇదే విషయం రెజీనాను అడిగితే.. గాట్టిగా నవ్వేసింది.

''అసలు క్లయ్ మ్యాక్స్ చాలా కొత్తగా బ్రిలియంట్ గా ఉంటుంది. మీరు ఊహించలేరు. ఆ టైపులో తీశాడు శ్రీనివాస్ అవసరాల. చాలా కొత్తగా ఉంటుంది. ఆ సీక్రెట్ ఏంటనేది మీరు 9వ తారీఖున తెలుసుకోవాల్సిందే'' అంటూ చెప్పింది అమ్మడు. ఈ సినిమాతో ఎలాగైనా పెద్దహిట్టు కొడతాననే కాన్ఫిడెన్స్ రెజీనా ముఖంలోనే కనిపిస్తోంది. చూద్దాం ఏమవుతుందో!!
Tags:    

Similar News