ఫోటో స్టోరీ: బ్యూటిఫుల్ రాక్ స్టార్

Update: 2019-08-11 12:19 GMT
రెజినా కసాండ్రా మొదట్లో కాస్త చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించింది కానీ ఈమధ్య మాత్రం టాలీవుడ్ లో జోరు తగ్గింది.  ఈమధ్య రెజినా నటించిన టాలీవుడ్ చిత్రాలు 'అ!'.. '7' మాత్రమే.  త్వరలో అడివి శేష్ 'ఎవరు' తో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా విజయంపై రెజినా చాలా ధీమాగా ఉందట.   అందుకే 'ఎవరు' ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది.

తాజాగా 'ఎవరు' కోసం జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమానికి మోడరన్ గా తయారై ఒక ఫోటో షూట్ లో పాల్గొంది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  ఈ ఫోటో షూట్ కు ఫోటోగ్రాఫర్ మహేష్ నంబూరి.  ఈ ఫోటోలో రెజినా ఒక కోటు లాంటి బటర్ ఫ్లై వింగ్స్ లాంటి స్లీవ్స్ ఉన్న గౌన్ ధరించింది.  ఈ గౌన్ వెరైటీ గా ఉంది. కాలర్.. బటన్లు.. థై స్లిట్ ఇలా ఒక హాటు డ్రెస్ కు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి.  స్టైలిష్ గాగుల్స్ ధరించిన రెజీనా ఒక విదేశీ భామ తరహాలో పోజిచ్చింది.  ఇయర్ రింగ్స్ కూడా విభిన్నంగా ఉన్నాయి.  

ఈ ఫోటోలకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "విదేశీ భామ లాగా ఉన్నావు".. "అమేజింగ్ డ్రెస్ బేబీ".. "బ్యూటిఫుల్ రాక్ స్టార్" అంటూ పొగడ్తలు కురిపించారు. రెజినా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళంలో 'కల్లాపార్ట్'.. 'కసడ తపర' అనే చిత్రాల్లో నటిస్తోంది. 

Tags:    

Similar News