• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రాధేశ్యామ్‌'కు రికార్డు...

'రాధేశ్యామ్‌'కు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ లాంఛ‌న‌మే

By - Tupaki Desk
Update: 2022-03-11 15:09 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన భారీ రొమాంటిక్ డ్రామా `రాధేశ్యామ్‌` ఈ రోజు దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌లై గ్రాండ్ ఓపెనింగ్స్ ని రాబ‌ట్టింది. గ‌త కొంత కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హెరిటేజ్ పిరియాడిక్ ల‌వ్ డ్రామా ఎట్ట‌కేల‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా మార్చి 11న థియేట‌ర్లలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీకి గురువారం నుంచే ప్రీమియ‌ర్ థియేట‌ర్ల వ‌ద్ద భారీ జాత‌ర మొద‌లైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మూవీ ఎట్ట‌కేల‌కు విడుద‌ల కావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు.  

భారీ విజువ‌ల్ వండ‌ర్ గా విడుద‌లైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చింది. `సాహో` మూవీ ద‌రువాత దాదాపు మూడున్న‌రేళ్ల విరామం అనంత‌రం థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన ఈ మూవీ నిజంగా ప్ర‌భాస్ అభిమానుల‌కు దేశ వ్యాప్తంగా పండ‌గ‌ని తీసుకొచ్చింద‌ని చెప్పొచ్చు. రొమాంటిక్ ల‌వ్ స్టోరీ కావ‌డం.. పైగా ఇట‌లీ అందాల నేఫ‌థ్యంలో రూపొందిన‌ హెరిటేజ్ ల‌వ్ స్టోరీ కావ‌డంతో సినిమా ఓ విజువ‌ల్ వండ‌ర్ గా ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు స‌రికొత్త అనుభూతినిచ్చింది.

ట్రేడ్ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం శుక్ర‌వారం ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా గ్రాండ్ ఓపెనింగ్స్ ల‌భించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు వున్న ఆల్ రికార్డ్స్ ని `రాధేశ్యామ్‌` బ్రేక్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన భారీ చిత్రాల్లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ ని కాబట్టిన మూవీగా `రాధేశ్యామ్` స‌రికొత్త రికార్డుని సాధించ‌బోతోంద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నార‌ట‌.

ఇప్ప‌టికే రికార్డు స్థాయిలో బుకింగ్స్ ని పూర్తి చేసుకున్న ఈమూవీ రానున్న రోజుల్లో బాక్సాఫీస్  వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని చెబుతున్నారు. ఈ చిత్రానికి ల‌భించిన భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌భాస్ స‌త్తాని మ‌రో సారి చాటింది. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ భారీ విజువ‌ల్ వండ‌ర్ ని యువీ క్రియేష‌న్స్, టి. సిరీస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాయి.

తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్య‌శ్రీ న‌టించారు. ఈ మూవీకి జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించగా నేప‌థ్య సంగీతాన్ని త‌మ‌న్ స‌మకూర్చాడు. మ‌నోజ్ ప‌ర‌మహంస కెమెరామెన్ గా వ‌ర్క్ చేసిన ఈ మూవీ తొలి రోజు రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం కాయంగా క‌నిపిస్తోంది. `రాధేశ్యామ్` తొలి రోజు ఎంత వ‌సూలు చేసింద‌న్న‌ది శ‌నివారం బ‌య‌టికి రానుంది. ఈ వీకెండ్ ఈ మూవీ ఏ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతుందో చూడాలి. 
Tags:    
  • Prabhas 
  • Pooja Hegde 
  • Radheshyam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

2026-11-09 06:05 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

Copyright @2026

Powered by Blink CMS