రివర్స్ గేమ్ మొదలు పెట్టిన సతీమణి!
| గోవిందా-సునీతా అహుజాల మధ్య విడాకుల వివాదం కొనసాగుతున్న వేళ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గోవిందాతో కలిసి దీపావళి జరుపుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్ల వైవాహిక బంధంలో వచ్చిన సమస్యలను తామే పరిష్కరించుకోగలమని, గతంలోలా కుటుంబంతో కలిసి బంగారం కొనుగోలు చేసే రోజులు మళ్లీ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ జోడీ గోవిందా-సునీతా అహుజాల మద్య విడాకుల వ్యవహారం ఎంత సంచలనమైందో తెలిసిందే. ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శిలు చేసు కోవడం..మధ్యలో మరికొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంటర్ అవ్వడం..వారికి నచ్చి వారికి మద్దతు ఇవ్వడం తెలిసిందే. వాళ్లందరిలో ఎక్కువగా హైలైట్ అయింది. కోమల్ రాణీ స్వార్ణకర్. భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తిగా కోమల్ పేరు నెట్టించ చర్చనీయాశంగా మారింది. అందుకు తగ్గట్టే కోమల్ తో కలిసి గోవిందా గుడులు గోపురాలు తిరగడం..వారి వెంబడించి నట్లుగా సునీతా అహుజా వ్యవహరించిన తీరు చూస్తే? ఇదీ ఓ ఇంట్రెస్టింగ్ సినిమా స్టోరీలానే హైలైట్ అయింది.
ముగ్గురి మధ్య ముక్కోణపు కథ నడుస్తున్నట్లే కనిపించింది. గోవిందా-సునితలు వ్యక్తిగతంగా ఒకర్ని ఒకరు దూషించుకోవడం..మీడియా ముందే రచ్చ చేయడం ఈ మొత్తం వ్యవహారాన్ని బాలీవుడ్ మీడియా ఓ రేంజ్ లో హైలైట్ చేయడం పెను సంంచలనమే సృష్టించింది. చివరిగా గోవిందా -కోమల్ వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా అంతకంతకు బలపడింది. సరిగ్గా ఇదే సమయంలో గోవింద సునితను ఉద్దేశించి కాస్త పాజిటివ్ గా మాట్లాడటం..సునితను ఎవరో వెనుకుండి నడిపిస్తున్నారని..ఇవన్నీ సునిత సొంత నిర్ణయాలు కాదని మాట్లాడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లారినట్లు కనిపించింది.
సరిగ్గా ఇదే సమయంలో సునితా అహుజా సైతం గోవిందాతో గత జ్ఞాపకాల్లోకి వెళ్లడం మరోసారి సంచలనంగా మారింది. గోవిందాతో మళ్లీ కలిసి దీపావళి పండగ చేసుకుంటానని ధీమా వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా పాత దీవాలీని గుర్తు చేసుకున్నారు. గోవిందాతో కలిసి ఉన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చిన బహుమతులు.. బంగారం.. దీపావళి సామాగ్రీని గుర్తు చేసుకున్నారు. కొన్నిసార్లు ఇద్దరు షాపు కి వెళ్లి బంగారం కొనే వాళ్లమని ఇంకొన్ని సార్లు తానే స్వయంగా కొని తెచ్చి సర్ ప్రైజ్ చేసేవారన్నారు. ఆ రోజులు త్వరాలోనే మళ్లీ వస్తాయి. మేమంతా కుటుంబంతో కలిసి మళ్లీ బంగారం షాపులకు వెళ్తామని ధీమా వ్యక్తం చేసారు.
అలాగే గోవిందా తనను మా ఇంటి అదృష్ట తేవత అని పిలిచేవారని సునీత గుర్తు చేసుకున్నారు. బాల్య నాటి ప్రేమికుడు కావడంతో? తాను ఎప్పుడు గోవిందా వెంటే ఉండేదాన్ని అని తెలిపారు. `గోవిందాతో మాట్లాడే సమయంలో ఒక్కోసారి బూతు పదాలు వచ్చేటప్పుడు? గోవిందా అభ్యంతరం వ్యక్తం చేసేవారన్నారు. మళ్లీ ఆరోజులన్నీ వస్తాయి. ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు. కాలాన్ని ఎదురించలేదు. ఏం పర్వాలేదు. 40 ఏళ్ల పాటు కలిసి ఉన్నా? ఈ సమస్యను తామే సరిదిద్దుకోగలం అని సునీతా అహుజా ధీమా వ్యక్తం చేసారు. ఈపాజిటివ్ యాంగిల్ తో ఇద్దరి ధాంపత్య జీవితం మళ్లీ దారిలో పడుతుందని అభిమానులు సైతం ధీమాగా ఉన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న నానుడిని గుర్తు చేస్తున్నారు.