• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లిటిల్ హార్ట్స్ ఫస్ట్...

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

| లిటిల్ హార్ట్స్ సినిమాలో మొదట తననే హీరోయిన్‌గా ఎంపిక చేశారని నటి సుష్మిత శెట్టి వెల్లడించింది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ అవకాశాన్ని కోల్పోయానని తెలిపింది. ఇప్పుడు మౌళితో కలిసి దొంగ నా కొడుకు సినిమాలో నటించడం సంతోషంగా ఉందని చెప్పింది. నవంబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కానుంది.

By - Madhu Reddy
Update: 2026-11-09 07:55 GMT

'90స్ ఏ మిడిల్ క్లాస్' బయోపిక్ డ్రామా సిరీస్ లో కీలక పాత్ర పోషించి, అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసినా మౌళి.. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా నటిస్తున్న మరో చిత్రం 'దొంగ నా కొడుకు'. నవంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో తెలుగు ఆడియన్స్ ను తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యింది సుష్మిత శెట్టి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్న ఈమె.. తన అందంతో, చక్కటి స్మైల్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. తన అందంతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. లిటిల్ హార్ట్స్ సినిమా ఫస్ట్ ఛాయిస్ తానే అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

"లిటిల్ హార్ట్స్ సినిమాకి మొదట నన్నే సంప్రదించారు. స్క్రీన్ టెస్ట్ అయ్యింది. ఫైనల్ కూడా అయిపోయింది. హీరోయిన్గా ఆ సినిమాతోనే నేను ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'జగమే సంగీతం' అనే సినిమా చేస్తున్నప్పుడు.. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. అయితే అక్కడ ప్రైమ్ టైం లో జరిగేటప్పుడు ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడం కుదరలేదు. ముఖ్యంగా రెండు సినిమాలకు డేట్స్ ను బ్యాలెన్స్ చేయలేకపోయాను. ఈ ఒక్క కారణంతోనే లిటిల్ హార్ట్స్ సినిమాని నేను కోల్పోయాను" అంటూ తెలిపింది సుష్మిత శెట్టి.

అయితే అప్పుడు మౌళితో నటించే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ.. ఇప్పుడు మళ్ళీ దొంగ నా కొడుకు అనే సినిమాలో అవకాశం లభించడం సంతోషంగా ఉంది అని తెలిపింది.ఈ చిత్రానికి శ్రీను కంబల దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు క్రైమ్ డ్రామా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇకపోతే తన కెరియర్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఈమె చెప్పుకొచ్చింది. వెండితెరపై లీడ్ హీరోయిన్ గా ఇదే తనకు మొదటి సినిమా అని చెప్పిన ఈమె.. తనను తాను నటిగా బిగ్ స్క్రీన్ పై చూసుకోవడానికి చాలా ఎక్సైట్ గా ఉంది అంటూ కూడా తెలిపింది. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ లో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టం అని మురిసిపోయిన సుష్మిత శెట్టి.. మౌళి లాంటి టాలెంటెడ్ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరింత అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చింది.

తన మూలాలు కన్నడలో ఉన్నప్పటికీ.. పుట్టి పెరిగిందంతా హైదరాబాదులోనే అని, విదేశాలలో చదువుకునే రోజుల నుంచి సినిమాలపై మక్కువ ఉండడంతో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశానని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల డాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ముఖ్యంగా దివంగత అందాల తార శ్రీదేవి తనకు పెద్ద స్ఫూర్తి అని చెప్పిన సుష్మిత శెట్టి.. డాన్స్ ద్వారా పలికించే హావ భావాలు తనను నటన వైపు నడిపించాయి అంటూ చెప్పుకొచ్చింది. మరి హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అవుతున్న సుష్మిత శెట్టి ఈ సినిమాతో ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    
  • sushmithashetty 
  • littlhearts 
  • donganakoduku 
  • mouli 
  • telugucinema 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS